ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన కరీంనగర్ వాసి.. ఆందోళనలో కుటుంబసభ్యులు

By Siva KodatiFirst Published Aug 18, 2021, 3:27 PM IST
Highlights

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్వారంకు చెందిన పెంచల వెంకటయ్య అనే వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయాడు. ఇతను కసం ప్రాంతంలోని ఏసీసీఎల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫ్ఘన్‌లో భయం భయంగా బతుకుతున్నామని తమను స్వదేశానికి తీసుకెళ్లేందుకు చొరవ చూపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నాడు

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్వారంకు చెందిన పెంచల వెంకటయ్య అనే వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయాడు. ఇతను కసం ప్రాంతంలోని ఏసీసీఎల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫ్ఘన్‌లో భయం భయంగా బతుకుతున్నామని తమను స్వదేశానికి తీసుకెళ్లేందుకు చొరవ చూపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. మరోవైపు వెంకటయ్యను క్షేమంగా భారతదేశానికి తీసుకురావాలని  గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థదితుల దృష్ట్యా కాబూల్ లోని కాబూల్‌లోని భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బంది, భద్రతా విభాగాల అధికారులను వెంటనే తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరందమ్ బగ్చీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తరలించారు. ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ లో వారిని మంగళవారం గుజరాత్ కి సురక్షితంగా తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

ఇదిలా ఉండగా.. ఆ దేశంలో ఉన్న భారతీయులందరినీ స్వదేశానికి తీసుకురావాలని.. ప్రభుత్వం  యోచిస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం 120 మంది అధికారులు, సిబ్బంది మొత్తం కలిపి 140 మందిని వాయిసేన సీ-17 విమానంలో కాబూల్ నుంచి తీసుకువచ్చారు.  ఎంబసీకి చెందిన కీలక పత్రాలను కూడా భద్రతంగా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 
 

click me!