మేయర్ అయినా వృత్తి ధర్మం మరువలేదు.. సకాలంలో స్పందించి గర్బిణీకి ప్రాణం పోశాడు...

By AN TeluguFirst Published Sep 29, 2021, 1:56 PM IST
Highlights

 వెంటనే ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రసవం కోసం ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో రమ్యకృష్ణకు తీవ్ర రక్తస్రావం అయ్యింది.  వైద్యం అందిస్తున్నప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాలేదు. అస్సలు కంట్రోల్ కాలేదు.  దీంతో విషయాన్ని వెంటనే  సీనియర్ జనరల్ సర్జన్ అయిన  నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ కు తెలిపారు.  

కరీంనగర్ : ప్రజా పాలనలో నిత్యం బిజీగా  ఉంటున్న రామగుండం నగరపాలక సంస్థ మేయర్ (ramagundam municipal corporation mayor)  డాక్టర్ బంగి అనిల్ కుమార్ (Dr bangi anil kumar)సకాలంలో స్పందించి ఓ గర్భిణికి (pregnant lady)మంగళవారం ఆపరేషన్ (operation)నిర్వహించి ప్రాణం పోశారు. మంథని మండలం గుంజపడుగు ప్రాంతానికి చెందిన  రమ్యకృష్ణ అనే గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి కి  తీసుకువచ్చారు. ఇది ఆమెకు రెండవ కాన్పు.

 వెంటనే ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రసవం కోసం ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో రమ్యకృష్ణకు తీవ్ర రక్తస్రావం అయ్యింది.  వైద్యం అందిస్తున్నప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాలేదు. అస్సలు కంట్రోల్ కాలేదు.  దీంతో విషయాన్ని వెంటనే  సీనియర్ జనరల్ సర్జన్ అయిన  నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ కు తెలిపారు.  

సకాలంలో స్పందించిన మేయర్‌ హుటాహుటిన ఆపరేషన్ థియేటర్కు చేరుకొని  సదరు గర్భిణీకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో పండంటి బాబుకు రమ్యకృష్ణ  జన్మనిచ్చింది.  తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉండడంతో ఆమె భర్త అశోక్ కుమార్, కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.  సకాలంలో స్పందించి శస్త్రచికిత్స అందించిన నగర మేయర్‌ను ఆసుపత్రి వైద్యులతో పాటు  రమ్యకృష్ణ కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ ఆపరేషన్ లో  డాక్టర్లు శౌరయ్య, స్రవంతి, కళావతితో పాటు  ఆపరేషన్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు. 

click me!