కేసీఆర్ స్కూళ్లు మూసేసి.. 300 కోట్లతో ఇళ్లు కట్టుకున్నారు: కపిల్ సిబాల్

By sivanagaprasad kodatiFirst Published Dec 2, 2018, 12:57 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్. హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు.

ప్రాథమిక విద్యను ముఖ్యమంత్రి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని... 4 వేల పాఠశాలలను మూసేసి రూ.300 కోట్లతో ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. పాఠశాలల్లో పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరని, స్కూళ్లు మూసేస్తే చదువుకోవడానికి పిల్లలు ఎక్కడికి వెళ్తారని సిబాల్ ప్రశ్నించారు.

చివరికి ప్రజారోగ్యాన్ని కూడా కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రిని కడతామన్న హామీ గాల్లో కలిసిపోయిందని కపిల్ ఆరోపించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్ల విడుదల చేయడం లేదని,  ఇంటింటికి నీళ్లు ఇస్తామని మాట తప్పరని ఎద్దేవా చేశారు.  ఓడిపోతే ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకుంటానని కేసీఆర్ అంటున్నారని...ఆయన రెస్ట్ తీసుకునే టైం వచ్చిందని దుయ్యబట్టారు.

click me!