తెలంగాణలో కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది.. పొన్నం

By ramya neerukondaFirst Published Dec 2, 2018, 12:40 PM IST
Highlights

కేసీఆర్ తను ఓడిపోతే వ్యవసాయం చేసుకుంటానని అనడం ఆయన ఓటమి అంగీకారాన్ని సూచిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్ జిల్లా వెనుక పడిందని మండిపడ్డారు. 

తెలంగాణ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నం ప్రభాకర్.. ఆదివారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ తను ఓడిపోతే వ్యవసాయం చేసుకుంటానని అనడం ఆయన ఓటమి అంగీకారాన్ని సూచిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్ జిల్లా వెనుక పడిందని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు ఆయన అహంకారనికి నిదర్శనమన్నారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అభివృద్ధికి నోచుకోని పనులపై పొన్నం మేనిఫెస్టో విడుదల చేశారు. 

వచ్చే పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ పట్టణంలో ఆరు రోజుల పాదయాత్రతో అన్ని సమస్యలు తెలుసుకొన్నానని తెలిపారు. కూటమిలోని అన్ని పార్టీలు తన గెలుపునకు సహకరిస్తున్నాయని ఆయన తెలిపారు. 

click me!