KTR: మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్ పై మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

By Mahesh Rajamoni  |  First Published Oct 28, 2023, 11:58 PM IST

BRS working president KTR: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (కేఎల్ఐపీ)లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ బ్లాక్-7లో ఇటీవల 11 పిల్లర్లలో 6 కుంగిపోవ‌డంతో మొత్తం 85 గేట్లతో మొత్తం 8 బ్లాకుల పునాదిని సమగ్రంగా పరిశీలించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ క్ర‌మంలోనే మంత్రి కేటీఆర్ ఆయా ప్రాజెక్టుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ మొత్తం జాతీయ ఆస్తి అనీ, వీటిని చిన్నచూపు చూడొద్దని పేర్కొన్నారు.
 


Kaleshwaram Lift Irrigation Project: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (కేఎల్ఐపీ)లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ బ్లాక్-7లో ఇటీవల 11 పిల్లర్లలో 6 కుంగిపోవ‌డంతో మొత్తం 85 గేట్లతో మొత్తం 8 బ్లాకుల పునాదిని సమగ్రంగా పరిశీలించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ క్ర‌మంలోనే మంత్రి కేటీఆర్ ఆయా ప్రాజెక్టుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ మొత్తం జాతీయ ఆస్తి అనీ, వీటిని చిన్నచూపు చూడొద్దని పేర్కొన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొత్తం జాతీయ ఆస్తి అనీ, దాన్ని చిన్నచూపు చూడొద్దని ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల‌లో కొన్ని కుంగిపోవ‌డం గురించి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ డ్యామ్ సేఫ్టీ ఎక్స్ పర్ట్ కమిటీ తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. బ్యారేజీ నిర్మించిన కాంట్రాక్ట్ ఏజెన్సీ దాని ఖర్చుతో దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

Latest Videos

undefined

ఐదేళ్లుగా బ్యారేజీ పనిచేస్తోందని, గత ఏడాది 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. వరదల్లో రెండు పంపుహౌజ్ లు మునిగిపోయినప్పుడు విమ‌ర్శ‌ల‌తో దూకినట్లే ఈసారి కూడా విపక్షాలు అదే పని చేస్తున్నాయ‌ని అన్నారు. నిర్మాణ సంస్థ తన ఖర్చుతో పంప్ హౌజ్ లకు మరమ్మతులు చేసినట్లే, రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా మేడిగడ్డ విషయంలోనూ అదే జరుగుతుందని  కేటీఆర్ వివరించారు.

తాను నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడనప్పటికీ సాంకేతిక సమస్య తలెత్తిందనీ, విధ్వంసం జరిగే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ తెల్ల ఏనుగుగా అభివర్ణించడంపై కేటీఆర్ స్పందించారు. "కాంగ్రెస్ లో అసలైన తెల్ల ఏనుగు. స్వాతంత్య్రానంతరం మహాత్మాగాంధీ కాంగ్రెస్ ను రద్దు చేయాలన్నారు. అది ఇంకా ఉనికిలో ఉండటం దురదృష్టకరమని" పేర్కొన్నారు.

click me!