కామారెడ్డి మాస్టర్ ప్లాన్: ఆత్మహత్యాయత్నం చేసిన రైతు బాలకృష్ణ

By narsimha lode  |  First Published Jan 17, 2023, 4:09 PM IST

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  బాలకృష్ణ అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు  బాలకృష్ణను  ఆసుపత్రికి తరలించారు. 


కామారెడ్డి: మాస్టర్ ప్లాన్ లో  తన  భూమి కోల్పోతాననే  ఆవేదనతో బాలకృష్ణ అనే రైతు  మంగళవారంనాడు ఆత్మహత్యాయత్నం  చేశాడు. వెంటనే  అతడిని  ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నెల  4వ తేదీన అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు రాములు ఆత్మహత్య  చేసుకున్నాడు. ఇవాళ  బాలకృష్ణ అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గుర్తించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. మాస్టర్ ప్లాన్ లో తన భూమి పోతోందని  రైతు ఆందోళనతో  పురుగుల మందు తాగినట్టుగా  రైతు జేఏసీ నేతలు  చెబుతున్నారు. 

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  రైతు జేఏసీ ఆధ్వర్యంలో  రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.ఈ నెల  5వ తేదీ నుండి  రైతులు ఆమ ఆందోళనలను ఉధృతం చేశారు. మాస్టర్ ప్లాన్ లో తన భూమి పోతోందనే ఆవేదనతో  రాములు ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళనలను  రైతు జేఏసీ సీరియస్ గా తీసుకుంది. ఈ నెల  5న కలెక్టరేట్ ముట్టడించింది. మాస్టర్ ప్లాన్ పై  కలెక్టర్ ప్రకటన చేయాలని రైతులు డిమాండ్  చేశారు.  ఉదయం నుండి   రాత్రి వరకు  కలెక్టరేట్ ముందు  ఆందోళన నిర్వహించారు.  ఈ ఆందోళనకు  బీజేపీ, కాంగ్రెస్ లు మద్దతు ప్రకటించాయి.  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే  ఏనుగు రవీందర్ రెడ్డిలు ధర్నాలో పాల్గొన్నారు.

Latest Videos

undefined

also read:కామారెడ్డి మాస్టర్ ప్లాన్: ఈ నెల 20న ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి రైతు జేఏసీ నిర్ణయం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  విలీన గ్రామాలకు  చెందిన  9 మంది కౌన్సిలర్లు  రాజీనామాలు సమర్పించాలని  జేఏసీ డెడ్ లైన్ పెట్టింది. ఈ డెడ్ లైన్ నేపథ్యంలో  ఇప్పటికే  ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు రాజీనామాలు చేశారు. మిగిలిన కౌన్సిలర్లు  రాజీనామాలు చేయాలని  జేఏసీ నేతలు కోరుతున్నారు.ఈ నెల  20వ తేదీన  ఎమ్మెల్యే  ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించాలని  రైతు జేఏసీ నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి  రైతుల తరహలోనే  జగిత్యాల మాస్టర్ ప్లాన్  ను నిరసిస్తూ  రైతులు ఆందోళనకు దిగారు. ఇవాళ జగిత్యాల కలెక్టరేట్ ను  రైతులు ముట్టడించారు.  మాస్టర్ ప్లాన్  ను వెనక్కి తీసుకోవాలని  రైతులు డిమాండ్  చేశారు.
 

click me!