ఆదాయానికి మించి ఆస్తులు: కామారెడ్డి డీఎస్పీపై సస్పెన్షన్ వేటు

Siva Kodati |  
Published : Dec 10, 2020, 07:53 PM IST
ఆదాయానికి మించి ఆస్తులు: కామారెడ్డి డీఎస్పీపై సస్పెన్షన్ వేటు

సారాంశం

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణను డీజీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణను డీజీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు అవినీతి శాఖ జరిపిన దాడుల్లో తేల్చారు. హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆయన భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు.

సికింద్రాబాద్, తిరుమలగిరిలో 30 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో ఐదుగురు నిందితులకు బెయిలు ఇచ్చేందుకు కామారెడ్డి ఇన్‌స్పెక్టర్‌ జగదీష్‌... నిందితుల నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశాడు.

నిందితులు ముందుగా లక్షాయాభై వేల రూపాయలు నగదు ఇస్తుండగా... ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో తనిఖీలు చేయగా 34 లక్షల రూపాయల నగదు, బంగారం, వెండి బయటపడింది.

అధికారులు జరిపిన సోదాల్లో ఆయా జిల్లాల్లోని 17 వ్యవసాయ భూములు, 5 ఇళ్ల ఖాళీ స్థలాలు, తిరుమలగిరి, సరూర్‌నగర్‌, మిర్యాలగూడ ప్రాంతాల్లో భవనాలతోపాటు బంగారం, నగదు లభించింది.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?