మానవత్వం చాటుకున్న కమాన్ పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్.. (వీడియో)

By AN TeluguFirst Published Apr 16, 2021, 7:18 PM IST
Highlights

కరోనా వచ్చిందంటే చాలు వారిని దూరం పెడుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న సమయంలో కమాన్ పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్ మానవత్వం చాటుకున్నారు. కరోనా పేషంట్ల పాలిట ఆపద్భాందవుడిగా మారారు. 

కరోనా వచ్చిందంటే చాలు వారిని దూరం పెడుతూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న సమయంలో కమాన్ పూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్ మానవత్వం చాటుకున్నారు. కరోనా పేషంట్ల పాలిట ఆపద్భాందవుడిగా మారారు. 

"

వివరాల్లోకి వెడితే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం  కమాన్ పూర్ మండలంలోని  రొంపి కుంట గ్రామంలో నివాసం ఉంటోంది. వీరంతా సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నారు.

కాగా వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్  రావడంతో ఇంటి యజమాని ఇల్లు కాళీ చేయాల్సిందిగా పట్టుబట్టాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న కమాన్ పూర్ ఎస్ఐ శ్యాం పటేల్ స్వయంగా ఇంటికి వచ్చి యజమానితో చర్చించాడు.

అయినా యజమాని వినకపోవడంతో గ్రామ సర్పంచ్, గ్రామంలోని యువత సహకారంతో వారిని ప్రభుత్వ స్కూల్ లోకి తరలించి , కరెంటు సరఫరా చేయించి వారికి పండ్లు, మాస్కులు, శానిటైజర్ లు అందించారు. 

కరోనా సోకిన వ్యక్తితో పాటు అతనితో ఉన్న మరో ఇద్దరికి కూడా కరోనా టెస్ట్ చేయించారు. అంతేకాదు గ్రామంలో  మరో ఇద్దరు జ్వరంతో బాధ పడుతున్నారని సర్పంచ్ ద్వారా తెలువగా వారికి కూడా టెస్ట్ లు చేయించారు.

కాగా వారిద్దరికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో.. వారిని గోదావరిఖని లోని ఐసోలేషన్ సెంటర్ కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

click me!