Nizambad Gang Rape : నిజామాబాద్ లో మహిళపై అత్యాచార ఘటన చాలా బాధాకరం.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Published : Sep 30, 2021, 03:19 PM IST
Nizambad Gang Rape : నిజామాబాద్ లో మహిళపై అత్యాచార ఘటన చాలా బాధాకరం.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

సారాంశం

సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి, ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారు. మహిళలపై వివక్ష చూపినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదు అన్నారు. నిజామాబాద్ లో అత్యాచారానికి గురైన బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున, వ్యక్తిగతంగానూ అన్ని రకాలుగా అండగా నిలుస్తాం.. అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 

నిజామాబాద్ (nizamabad)నగరంలో మహిళపై అత్యాచార ఘటన (nizambad gang rape) చాలా బాధాకరం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించదన్నారు.  24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ శాఖ వారికి అభినందనలు తెలియజేశారు. 

సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి, ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారు. మహిళలపై వివక్ష చూపినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదు అన్నారు. నిజామాబాద్ లో అత్యాచారానికి గురైన బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున, వ్యక్తిగతంగానూ అన్ని రకాలుగా అండగా నిలుస్తాం.. అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 

కాగా, నిజామాబాద్ లో నలుగురు యువకులు ఓ యువతి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్థరాత్రి ఈ దారుణం జరిగింది. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్ 100కు ఫిర్యాదు చేశారు. ఆ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. యువతికి మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. ఘటనమీద కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు..  గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. 

మరో  ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో యువతికి మధ్య స్నేహం ఏర్పడింది. మంగళవారం నాడు తన బర్త్‌డే సందర్భంగా యువతిని ఆ వ్యక్తి పిలిచాడు.ఈ బర్త్‌డే పార్టీలో యువతి పాల్గొంది. ఆర్మూర్ నుండి నిజామాబాద్ కు వచ్చిన యువతి ఆ విందులో పాల్గొంది. ఆర్మూర్ కు తిరిగి వెళ్లే సమయంలో యువతిని ఆ యువకుడు బస్టాండ్ కు సమీపంలోని తన స్నేహితుడు ఉన్న ఆసుపత్రికి తీసుకొచ్చాడు. 

Nizambad gang Rape: ముగ్గురు అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు

అక్కడే యువతికి కూల్‌డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. యువతి స్నేహితుడితో పాటు మరో ఇద్దరు కూడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరో ఇద్దరు నిందితులకు సహకరించారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రి వద్ద సెక్యూరిటీ గార్డులు అపస్మారకస్థితిలో ఉన్న యువతిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలించారు. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.  యువతిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu