కవిత చొరవ.. కోలుకున్న సాగర్

Siva Kodati |  
Published : Dec 17, 2020, 09:16 PM IST
కవిత చొరవ.. కోలుకున్న సాగర్

సారాంశం

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ కు చెందిన సాగర్ అనే బాలుడు తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. 2017లో ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాగర్ పట్ల మానవీయ దృక్పథంతో స్పందించి ఆదుకున్నారు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ కు చెందిన సాగర్ అనే బాలుడు తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. 2017లో ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాగర్ పట్ల మానవీయ దృక్పథంతో స్పందించి ఆదుకున్నారు.

అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సాగర్ శస్త్రచికిత్స కోసం రూ.26 లక్షల ఎల్వోసీ మంజూరు చేశారు. అంతేకాకుండా చిన్నారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యాధికారులతో మాట్లాడుతూ కవిత ఆరా తీసేవారు.

కాలేయ మార్పిడి తర్వాత కోలుకున్న సాగర్, అతని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై కవిత స్పందించారు. ఎట్టకేలకు సాగర్ ను కలిశానని ఆమె ట్విట్టర్ లో వెల్లడించారు.

చిన్నవయసులోనే కాలేయ మార్పిడి చేయించుకుని ఇప్పుడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడని చెప్పడానికి గర్విస్తున్నానని కవిత పేర్కొన్నారు. అతడికి భగవంతుడు దీర్ఘాయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని కవిత ఆకాంక్షించారు.

 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి