కాలేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారింది.. రాహుల్ గాంధీ

By SumaBala Bukka  |  First Published Nov 2, 2023, 9:10 AM IST

అంబటిపల్లిలో రాహుల్ గాంధీ మహిళలతో సమావేశం అయ్యారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ కు ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు.


భూపాలపల్లి : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంబటిపల్లిలో ఏర్పాటైన సమావేశంలో పాల్గొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారిందని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకి ఏంటిఎంలా మారిందంటూ ఘాటుగా స్పందించారు. 

తెలంగాణను కేసీఆర్ దోచుకున్నాడని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేస్తాం అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ రూ. 500లకే అందిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళ ఖాతాలో రూ. 2500 ఖాతాలో జమ చేస్తామన్నారు. 

Latest Videos

బిఆర్ఎస్, బిజెపి, ఎంఏఎం కలిసి పోటీ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు బిజెపి, ఎంఏఎం పూర్తిగా మద్దతు తెలుపుతోందన్నారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరు జరుగుతుందన్నారు. ఇక అంబటిపల్లి నుంచి రాహుల్ గాంధీ మేడిగడ్డకు బయలుదేరారు. అయితే, మేడిగడ్డలో ఒక్కరికి మాత్రమే అనుమతి ఉందని.. రాహుల్ గాంధీకి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. 

click me!