నిశ్చితార్థమైన అమ్మాయిని లేపుకుపోయినట్లుంది కాంగ్రెస్ వ్యవహారం... సీపీఐ నారాయణ సెటైర్లు...

Published : Nov 02, 2023, 08:46 AM ISTUpdated : Nov 02, 2023, 08:47 AM IST
నిశ్చితార్థమైన అమ్మాయిని లేపుకుపోయినట్లుంది కాంగ్రెస్ వ్యవహారం... సీపీఐ నారాయణ సెటైర్లు...

సారాంశం

తమతో పొత్తు విషయంలో కాంగ్రెస్ ఏమీ తేల్చకుండా నానుస్తుందంటూ సీపీఐ నారాయణ సెటైరికల్ ట్వీట్ చేశారు. 

హైదరాబాద్ : కాంగ్రెస్ తో పొత్తు విషయంపై సిపిఐ నారాయణ  చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పొత్తులపై ఏమి తేల్చకుండా ఇంకా నానుస్తుందని విమర్శిస్తూ… నిశ్చితార్థమైన అమ్మాయిని/అబ్బాయిని లేపుకుపోయినట్లుగా.. రాజకీయాలు  జరుగుతున్నాయని ఘాటుగా విమర్శించారు. తమతో పొత్తు, సీట్ల కేటాయింపు విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వకుండా నానుస్తున్న కాంగ్రెస్ తీరుపై విమర్శలు గుప్పించారు. 

తాజాగా బిజెపి నేత వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు చెన్నూరు కాంగ్రెస్ సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే  కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా చెన్నూరు సీటును సిపిఐ కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిపిఐ నారాయణ చేసిన ఈ ట్వీట్ కలకలం రేపుతోంది. గురువారం మధ్యాహ్నానికి ఈ విషయంపై క్లారిటీ రానుందని సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!