
హైదరాబాద్: అమరజ్యోతి నిర్మాణంలో అవినీతి జరిగిందన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ ఫైర్ అయ్యాడు. అమరుల త్యాగాలను స్మరించుకుంటే ఓర్వలేని కుంచిత మనస్తతత్వం రేవంత్‌ది అని విమర్శించారు. అమరజ్యోతి గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణ ఉద్యమకారులపైకి పిట్టల దొరలా తుపాకీతో వెళ్లిన రేవంత్ రెడ్డా అమర వీరుల గురించి మాట్లాడేది? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అమరుల గురించి మాట్లాడితే వారి ఆత్మలు ఘోషిస్తాయని అన్నారు. ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల గురించి ఏం తెలుసు అని ఆగ్రహించారు.
అమరుల బలిదానాలు కాంగ్రెస్ వల్లే జరిగాయని మంత్రి వేముల ప్రశాంత్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన జాప్యం, గందరగోళ ప్రకటనల వల్లే అని విమర్శించారు. అమరులను చంపిందే సోనియా గాంధీ అని ఆరోపించారు. కామన్ మినిమం ప్రోగ్రామ్‌లో పెట్టి మాట తప్పారని, 2009 డిసెంబ్ 9వ తేదీన తెలంగాణ ప్రకటన చేసి వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. అందుకే బలిదానాలు జరిగాయని వివరించారు.
రేవంత్ రెడ్డి స్వయంగా సోనియా గాంధీ బలిదేవతా అని అన్నాడని మంత్రి ప్రశాంత్ పేర్కొన్నారు. ఇప్పుడు అమరుల కుటుంబాలతో సోనియా గాంధీ సహపంక్తి భోజనాలు చేస్తుందనడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు.
Also Read: పార్టీ మారుతామనే వాళ్లను ఆపబోం.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అమరజ్యోతి నిర్మాణం కేసీఆర్ ఎంతో పారదర్శకతతో, పెద్ద మనసుతో నిర్మించా రని వివరించారు. స్వాతంత్ర్యం తర్వాత సుమారు 50 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ స్వాతంత్ర్య సమర యోధులను స్మరిస్తూ ఢిల్లీలో ఒక్క స్మారకాన్ని అయిన ఎందుకు నిర్మించ లేదని ప్రశ్నించారు. ఎందుకంటే కేసీఆర్‌కు ఉన్నంత పెద్ద మనసు కాంగ్రెస్‌కు లేదని తెలిపారు. ఇక నుంచి కేసీఆర్, కేటీఆర్ పైనా రేవంత్ రెడ్డి దురుసుగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, ఖబర్దార్ అని అన్నారు.