కేపీ చౌదరి కస్టమర్లలో నలుగురు హీరోయిన్లు, ఇద్దరు నిర్మాతలు .. వెలుగులోకి సంచలన విషయాలు, కీలకంగా కాల్ డేటా

Siva Kodati |  
Published : Jun 17, 2023, 03:44 PM IST
కేపీ చౌదరి కస్టమర్లలో నలుగురు హీరోయిన్లు, ఇద్దరు నిర్మాతలు ..  వెలుగులోకి సంచలన విషయాలు, కీలకంగా కాల్ డేటా

సారాంశం

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి విషయంలో పోలీసులు తవ్వేకొద్దీ కీలక విషయాలు రాబడుతున్నారు. దర్యాప్తు మరింత ముందుకు సాగేందుకు గాను కేపీ చౌదరిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి విషయంలో పోలీసులు తవ్వేకొద్దీ కీలక విషయాలు రాబడుతున్నారు. అతనికి తెలుగు చిత్ర సీమకు చెందిన బడా వ్యక్తులతో పరిచయాలు వున్నట్లు తేల్చారు. అంతేకాదు అతను పలువురు సెలబ్రెటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడని.. వీరిలో నలుగురు హీరోయిన్లు, ఇద్దరు నిర్మాతలు, నలుగురు చిన్న హీరోలు వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో కేపీ చౌదరి కాల్ లిస్ట్‌లో వున్న వారిని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. దర్యాప్తు మరింత ముందుకు సాగేందుకు గాను కేపీ చౌదరిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

మరోవైపు కేపీ చౌదరి అరెస్ట్‌తో డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్‌లు, నైజీరియన్ ముఠాలు అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. వీరు కొన్ని రోజుల పాటు హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని యువత, విద్యార్ధులే టార్గెట్‌గా ఈ గ్యాంగ్‌లు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. 

Also Read: డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులో కబాలి సినీ నిర్మాత కె.పి.చౌదరి...

ఈ కేసుకు సంబంధించి కేపీ చౌదరికి గత బుధవారం కోర్ట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే కేపీ చౌదరికి చాలా మంది సెలబ్రెటీలతో సంబంధాలు వున్నాయని తెలిపారు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయనను మూడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెప్పారు. అతను డ్రగ్స్‌ను కొనుగోలు చేసి సెలబ్రెటీలకు అమ్ముతూ వుంటాడని డీసీసీ తెలిపారు. ఈ క్రమంలోనే 90 గ్రాముల కొకైన్‌ను సెలబ్రెటీలకు అమ్మేందుకు కేపీ చౌదరి తెచ్చాడని..అతని వద్ద డ్రగ్స్‌ను కొనుగోలు చేసే వారి చిట్టా సేకరిస్తామని డీసీపీ వెల్లడించారు. అలాగే కేపీ చౌదరి గతంలో డ్రగ్స్‌ను ఎవరెవరికి విక్రయించాడనే వివరాలను కూడా సేకరిస్తామని ఆయన చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే