ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. తమ పార్టీలోకి వస్తే గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని అన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. తమ పార్టీలోకి వస్తే గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని అన్నారు. ఖమ్మంలో పార్టీ కార్యాలయాన్ని కేఏ పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తే బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆయనకు ఓటేయరని అన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో 10 సీట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరుకున్న వ్యక్తులకు ఇస్తామని.. ఆయన తమ పార్టీలో చేరాలని కోరారు. తాను సీఎం అయితే.. ఆయనను డిప్యూటీ సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. తనకు కుల, మత పట్టింపులు లేవని అన్నారు.
40 ఏళ్లలో ఇలాంటి రైలు ప్రమాదం జరగలేదని.. రైలు ప్రమాదంపై బాధ్యత వహించి ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఓడిపోయిందని.. ఎక్కడా గెలిచే పరిస్థితి లేదన్నారు. కర్ణాటకలో అందరం సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ గెలిచిందని అన్నారు.
చంద్రబాబు ఢిల్లీ టూర్ పెద్ద డ్రామా అని విమర్శించారు. ఐదేళ్లు చంద్రబాబుకు అమిత్ షా పర్మిషన్ ఇవ్వలేదన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చనిపోవడానికి కారణం చంద్రబాబునేనని ఆరోపించారు. చంద్రబాబు ఇక తప్పించుకోలేడని.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ జాగ్రత్తగా ఉండాలని అన్నారు.