నేను శపిస్తే.. నాశనం అయిపోతారు, కేటీఆర్ కి పాల్ వార్నింగ్

Published : May 07, 2019, 01:55 PM IST
నేను శపిస్తే.. నాశనం అయిపోతారు, కేటీఆర్ కి పాల్ వార్నింగ్

సారాంశం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన పాల్... కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శల వర్షం కురిపించారు. 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన పాల్... కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శల వర్షం కురిపించారు. 

తనతో పెట్టుకోవద్దంటూ కేటీఆర్ కి పాల్ వార్నింగ్ ఇచ్చారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్ల విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని...23 కుటుంబాలు వీళ్ల వల్ల ఏడుస్తున్నాయని అన్నారు. కేటీఆర్‌కు డబ్బులు ఎక్కువైతే కాంగ్రెస్, కోదండరాంతో పెట్టుకోవాలంతే కానీ ప్రపంచాన్ని జయించిన తనతో పెట్టుకోవద్దని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

తానేం మందా కృష్ణమాదిగను కానని..2008లో కేసీఆర్ తన దగ్గరకు వస్తే ఆశీర్వదించానని పాల్ చెప్పుకొచ్చారు. మెదట తెలంగాణకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌కు ఫండింగ్ కూడా చేశానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

‘‘కేటీఆర్‌కు పచ్చి పట్టింది. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. కేటీఆర్‌కు డబ్బు, అహంకారం ఎక్కువైంది. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోతారా?. కేటీఆర్ చినజీయర్ స్వామి కాళ్ళు పట్టుకున్నా ఆయన కూడా కాపాడలేడు. కేసీఆర్‌ను పూజారులు కూడా కాపాడలేరు. నేను శాపం పెడితే నాశనం‌ అయిపోతారు.’’ అని పాల్ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు