దిశ ఎన్‌కౌంటర్ కేసు‌.. విచారణ పూర్తి చేసిన సిర్పూర్కర్‌ కమిషన్.. సుప్రీం కోర్టుకు చేరిన నివేదిక

By Sumanth KanukulaFirst Published Jan 31, 2022, 12:53 PM IST
Highlights

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ఏర్పాటైన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ (Justice Sirpurkar Commission) విచారణను పూర్తి చేసింది. విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీం కోర్టుకు (Supreme Court) సమర్పించింది.

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ఏర్పాటైన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ (Justice Sirpurkar Commission) విచారణను పూర్తి చేసింది. విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీం కోర్టుకు (Supreme Court) సమర్పించింది. సిర్పూర్కర్‌ కమిషన్ ఈ నెల 28న సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. 2019 నవంబర్‌లో  షాద్‌నగర్‌ శివారు జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని డిసెంబర్‌ 6 తెల్లవారు జామున సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం పోలీసులు చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నింది మరణించారు. 

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ త్రిసభ్య కమిషన్‌ని వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ చైర్మెన్ గా సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్డి జస్టిస్ సిర్పూర్కర్ ను నియమించింది.

Latest Videos

ఈ కమిషన్ 47 రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగింది. ఫోరెన్సిక్ నివేదికలు, డాక్యుమెంట్ రికార్డ్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, సీన్ ఆఫ్ అఫెన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిషన్ సభ్యులు సేకరించారు. అడ్వకేట్స్, ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, మాజీ సైబరాబాద్ సీపీ సజ్జనార్, దిశ కుటుంబ సభ్యులు, ఎన్ కౌంటర్ లో చనిపోయిన కుటుంబ సభ్యులను కమిషన్ కలిసి విచారణ చేపట్టింది. తాజాగా విచారణ పూర్తి చేసి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. 


 

click me!