Fever survey : తెలంగాణలో 4 లక్షల మందిలో కరోనా లక్షణాలు.. ఆరోగ్యశాఖ నివేదిక..

Published : Jan 31, 2022, 11:26 AM IST
Fever survey : తెలంగాణలో 4 లక్షల మందిలో కరోనా లక్షణాలు.. ఆరోగ్యశాఖ నివేదిక..

సారాంశం

రాష్ట్రంలో ఇంటింటా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పుల సమస్యలు తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలో ఈ విషయాన్ని గుర్తించారు. కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే మొత్తం 4,00,283మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు సర్వే ద్వారా గుర్తించారు అధికారులు.  మొత్తం 90 లక్షల పైగా ఇళ్లలోనూ ఆసుపత్రి ఓపిల్లో మరో 6.58 లక్షల మందిని పరిశీలించగా పై విషయం నిర్ధారణ అయింది. 

హైదరాబాద్ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా corona virus మహమ్మారి విజృంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ కొత్త new variantలో జనాలను భయాందోళనలకు గురి చేస్తోంది. omicron variantతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. third wave రూపంలో విరుచుకు పడుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. ఇక తెలంగాణలో కూడా థర్డ్ వేవ్ రూపంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.  

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ Fever survey చేపట్టింది.  రాష్ట్రంలో ఇంటింటా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పుల సమస్యలు తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలో ఈ విషయాన్ని గుర్తించారు. కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే మొత్తం 4,00,283మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు సర్వే ద్వారా గుర్తించారు అధికారులు.  

మొత్తం 90 లక్షల పైగా ఇళ్లలోనూ ఆసుపత్రి ఓపిల్లో మరో 6.58 లక్షల మందిని పరిశీలించగా పై విషయం నిర్ధారణ అయింది. అయితే వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కాకపోయినా  3,97,898 మందికి ఔషధ కిట్లు అందించారు.  జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు ఫీవర్ సర్వే, కోవిడ్ ఓపీ సేవల్లో భాగంగా కిట్లను పంపిణీ చేశారు. రెండో విడత సర్వే జగిత్యాల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, వనపర్తి, నిజామాబాద్, భద్రాద్రి, మంచిర్యాల్, ఆదిలాబాద్,  సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. 
ఈ మేరకు వైద్యారోగ్యశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో 1,170 ఓపీ కేంద్రాలను నిర్వహించగా.. 6,58,879 మందిలో జలుబు,  జ్వరం, ఒళ్ళు నొప్పులు తదితర సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో 94,910 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. వారికి  కరోనా కిట్లు అందజేశారు. ఓపి సేవల్లో అత్యధికంగా  హైదరాబాదులో 1,70,962 మంది వైద్యులను సంప్రదించారు. ఇక్కడ  18,758 కిట్లను అందించారు.  

ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం-  9,170,  మేడ్చల్ మల్కాజిగిరి- 8,278,  ఖమ్మం-  5,346, నల్గొండ- 4,374, రంగారెడ్డి-  3,856, సంగారెడ్డి- 3,138,  కరీంనగర్- 3,123, మంచిర్యాల- 3093, పెద్దపల్లి  2,897, నిజామాబాద్- 2,833,  నాగర్ కర్నూల్- 2,804, యాదాద్రి భువనగిరి-  2,503, సిద్దిపేట- 2,135 జిల్లాలో అత్యధిక మెడిసిన్ కిట్లను అందించారు. ఇక అతి తక్కువగా మహబూబాబాద్ జిల్లాలో 185 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

తెలంగాణ వ్యాప్తంగా 16,258 వైద్య బృందాలు తొమ్మిది రోజుల్లోనే 90,54,725 ఇళ్లలో ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో  మూడు లక్షల 3,05,373 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మెడిసిన్ కిట్లను అందించారు వైద్యులు. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎక్కువగా 5,45,300 ఇళ్లలో జ్వర సర్వే చేశారు. హనుమకొండ జిల్లాలో సైతం కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఉన్నట్లు సర్వే ద్వారా వెల్లడయింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu