దిశ నిందితుల ఎన్ కౌంటర్: మంత్రి గంగుల కమలాకర్ రియాక్షన్

By Nagaraju penumalaFirst Published Dec 6, 2019, 10:41 AM IST
Highlights

నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్. అడబిడ్డలకు తెలంగాణ సేఫ్ జోన్ అని చెప్పుకొచ్చారు. మహిళల వైపు చూడాలంటే వణుకు పుట్టాలి అంటూ హెచ్చరించారు. 

కరీంనగర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ హత్యకేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఇదీ తెలంగాణ పోలీసుల సత్తా అంటూ కొనియాడారు.

నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్. అడబిడ్డలకు తెలంగాణ సేఫ్ జోన్ అని చెప్పుకొచ్చారు. మహిళల వైపు చూడాలంటే వణుకు పుట్టాలి అంటూ హెచ్చరించారు. 

అల్లరిమూకల ఆగడాలకు తెలంగాణలో స్థానం లేదనడానికి ఈ ఎన్ కౌంటర్ ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ వర్థంతి రోజున ఆయనకు ఇదే నిజమైన నివాళి అని అన్నారు మంత్రి గంగుల కమలాకర్.

దిశకు న్యాయం... రియల్ లైఫ్ సింగం.. సజ్జనార్ అంటూ... నెటిజన్ల ఆనందాలు

ఇకపోతే తెలంగాణ వైద్యురాలు దిశను గతనెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 

Disha Case: మంచి పని చేస్తే ప్రజలు అభినందిస్తారు.... ఎన్ కౌంటర్ పై పోలీసుల స్పందన

click me!