దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. సీన్ రీ కనస్ట్రక్షన్ సందర్బంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. సీన్ రీ కనస్ట్రక్షన్ సందర్బంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
undefined
షాద్‌నగర్ కోర్టు ఆదేశం మేరకు పోలీసులు చర్లపల్లి జైలు నుండి పోలీసులు తమ కస్టడీకి తీసుకొన్నారు. చర్లపల్లి జైలు నుండి తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున నిందితులతో పోలీసులు చటాన్‌పల్లి వద్ద సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో చటాన్‌పల్లి వద్ద పోలీసుల నుండి నిందితులు తప్పించుకొనే ప్రయత్నం చేశారు.
చటాన్ పల్లి వద్ద నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులపై దాడి చేసి పోలీసుల ఆయుధాలు లాక్కోని వారిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే మృతిచెందారు.
గత నెల 27వ తేదీన నిందితులు శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ వద్ద దిశపై గ్యాంగ్‌రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ కేసు విషయంలో పోలీసులు కూడ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి.దిశ హత్య కేసు విచారణ కోసం మహాబూబ్ నగర్ లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు.
Also read:Justice For Disha:సీల్డ్ కవర్లో కోర్టుకు కీలక ఆధారాలు
షాద్ నగర్ కోర్టు నుండి మహాబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసు విచారణ బదిలీ చేయనున్నారు. ఈ సమయంలోనే సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు ,పారిపోయే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే పోలీసుల ఎన్ కౌంటర్ లో నిందితులు చనిపోయారు.
Also readJustice for Disha: పోలీస్ కస్టడీకి దిశ హత్య కేసు నిందితులు
రెండు రోజుల క్రితం పోలీసులు నిందితులను తమ కస్టడీలోకి తీసుకొన్నారు. గురువారం నాడు దిశ ఉపయోగించిన సెల్‌ఫోన్ ను పాతిపెట్టిన స్థలాన్ని నిందితులు పోలీసులకు చూపించారు.
Also read:Justice For Disha:సీల్డ్ కవర్లో కోర్టుకు కీలక ఆధారాలు
ఈ స్థలం నుండి పోలీసులు దిశ ఫోన్ ను స్వాధీనం చేసుకొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున నిందితులు చటాన్ పల్లి నుండి పారిపోతున్న తరుణంలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు.
దిశా కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. మొత్తం నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో పోలీసుల కళ్లుగప్పి పారిపోతుండగా వారిపై కాల్పులు జరిపారు. దిశాను చంపేసిన తగులబెట్టిన చోటే నలుగురు రేపిస్టును చంపేశారు.
గురువారం నాడు రాత్రి నిందితులను ఒక్కొక్కరిగా జైలు నుండి తీసుకొచ్చి పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. శుక్రవారం నాడు తెల్లవారుజామున నలుగురితో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటన చేయనున్నారు.