బ్యాంకులను ముంచడంలో జూపల్లి దిట్ట : డికె అరుణ ఫైర్

Published : Apr 17, 2018, 07:21 PM IST
బ్యాంకులను ముంచడంలో జూపల్లి దిట్ట : డికె అరుణ ఫైర్

సారాంశం

బ్యాంకులను ముంచడంలో జూపల్లి అరితేరాడు. జూపల్లి ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మంత్రులు చేసే అగడాలు సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదా .. లేక దోపిడీ చేసుకోండంటూ మంత్రులకు జిల్లాలు రాసిచ్చిండా?

మంత్రి జూపల్లి ఇసుక మాఫియాలో మునిగి తేలుతున్నారు. జూపల్లి అండతో జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు అరు కాయలుగా కొనసాగుతున్నది. బ్యాంకులను ముంచడంలో జూపల్లి అరితేరాడు. జూపల్లి ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మంత్రులు చేసే అగడాలు సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదా .. లేక దోపిడీ చేసుకోండంటూ మంత్రులకు జిల్లాలు రాసిచ్చిండా? నేను ప్రగతి భవన్ లో కూర్చొని దోచుకుంటున్నా .. మీరు జిల్లాల్లో దోచుకొండని మంత్రులకు చెప్పాడా?

అక్రమ ఇసుక రవాణా ఎలా జరుగుతుందో చూపిస్తా. వచ్చేందుకు జూపల్లికి దమ్ముందా? జూపల్లి తెలంగాణ  ఖనిజ సంపదను ఆంధ్రకు తరలిస్తున్నారు. తెలంగాణపై ఇదేనా మీకుఉండే చిత్తశుద్ధి? వివాదాల్లో ఉన్న భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్స్ తీసుకోవడం ఎక్కడి నీతి. బ్యాంకులను దోచుకోవడం కాదా? జూపల్లి తాను బ్యాంకులను ముంచింది చాలదని .. ఇప్పుడు కొడుకులను కూడా రంగులోకి దించాడు. జూపల్లి కొడుకులు తండ్రికి తగ్గ తనయులుగా నిరూపించుకుంటున్నారు. కేసీఆర్ తక్షణం జూపల్లి ని మంత్రివర్గం నుంచి తప్పించాలి. రాజయ్యను మంత్రి పదవినుంచి తప్పించిన కేసీఆర్ .. జూపల్లి తన బందువని ఉపేక్షిస్తున్నారా?

కోమటిరెడ్డి ,సంపత్ ల సభ్యత్వ రద్దు చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. కేసీఆర్ సర్కార్ కు కోర్ట్ తీర్పు చెంపపెట్టులాంటిది. కేసీఆర్ కు ఏమాత్రం సిగ్గు ఉన్నా రాజీనామా చేయాలి. కేసిఆర్ నిజమైన తెలంగాణ వాడే అయితే రాజీనామా చేయాలి. కోర్టుల్లో కేసీఆర్ సర్కార్ మొట్టికాయలు తిని తిని మెద్దుపారిపోయింది. కేసీఆర్ కు ఒక్క రోజు కూడా పదవిలో కొనసాగే నైతికత లేదు.

కేసీఆర్ కు ఏమాత్రం ధైర్యం ఉన్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి. లేకుంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వచ్చినా మేము సిద్దమే. కోర్ట్ తీర్పు పై స్పీకర్ సరైన విధంగా స్పందించకపోతే .. ప్రజలే రాబోయే రోజుల్లో సరైన బుద్ధి చెబుతారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy: వంట చేసి విద్యార్థులతో కలిసి తిన్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
CM Revanth Reddy Inaugurates Telangana Public School | Breakfast Scheme Launched | Asianet Telugu