జూనియర్ ఆర్టిస్ట్ మృతి: మరణంపై అనుమానాలు.. యశోదా ఆసుపత్రి ముందు మిత్రుల ధర్నా

Siva Kodati |  
Published : Jan 18, 2022, 08:39 PM IST
జూనియర్ ఆర్టిస్ట్ మృతి: మరణంపై అనుమానాలు.. యశోదా ఆసుపత్రి ముందు మిత్రుల ధర్నా

సారాంశం

జూనియర్ ఆర్టిస్ట్ (junior artist) జ్యోతిరెడ్డి (jyothi reddy) అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టాలని మలక్‌పేట (malakpet) యశోదా హాస్పిటల్ (yashoda hospital) ముందు ఆందోళన నిర్వహించారు జూనియర్ ఆర్టిస్టులు. 

జూనియర్ ఆర్టిస్ట్ (junior artist) జ్యోతిరెడ్డి (jyothi reddy) అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టాలని మలక్‌పేట (malakpet) యశోదా హాస్పిటల్ (yashoda hospital) ముందు ఆందోళన నిర్వహించారు జూనియర్ ఆర్టిస్టులు. కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి ఉదయం షాద్ నగర్ రైల్వేస్టేషన్ పట్టాలపై గాయాలతో పడివుంది. దీనిని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మొదట షాద్ నగర్‌లోని (shad nagar) ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. తిరిగి మరింత మెరుగైన చికిత్స కోసం స్నేహితులు మలక్‌పేట‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే మృతురాలు సహచరులు ధర్నా చేపట్టారు. జ్యోతిరెడ్డి మరణంపై అనుమానాలు వున్నాయని.. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్