రహస్యంగా తాళికట్టి, వాడుకుని... బెజవాడ చెక్కేసిన జూనియర్ ఆర్టిస్ట్

Published : Sep 13, 2018, 09:43 AM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
రహస్యంగా తాళికట్టి, వాడుకుని... బెజవాడ చెక్కేసిన జూనియర్ ఆర్టిస్ట్

సారాంశం

మహిళా జూనియర్ ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకుని కాపురం చేసి మోసం చేశాడు మరో జూనియర్ ఆర్టిస్ట్. విశాఖపట్నానికి చెందిన మహిళా జూనియర్ ఆర్టిస్ట్‌కు కృష్ణనగర్ బీ బ్లాక్‌లో నివసిస్తోంది. 

మహిళా జూనియర్ ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకుని కాపురం చేసి మోసం చేశాడు మరో జూనియర్ ఆర్టిస్ట్. విశాఖపట్నానికి చెందిన మహిళా జూనియర్ ఆర్టిస్ట్‌కు కృష్ణనగర్ బీ బ్లాక్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా 2016లో విజయవాడకు చెందిన చైతన్య అనే జూనియర్ ఆర్టిస్ట్ పరిచయం అయ్యాడు.

ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ సహజీవనం చేశారు. అయితే ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. ఒక రోజు ఇంట్లోనే దేవుడి చిత్రపటం ముందు తాళి కట్టాడు... ఈ విషయాన్ని పెద్దలకు చెబుతానని ఆమెను నమ్మించాడు.

అయితే గత నెల 13న ఇంటికి వచ్చిన చైతన్య బంధువులు అతన్ని బలవంతంగా విజయవాడకు తీసుకెళ్లారు. ఫోన్‌లో మాట్లాడేందుకు సైతం ఆమెకు అవకాశం ఇవ్వడం లేదు.. దీంతో మోసపోయానని గ్రహించిన సదరు యువతి చైతన్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్