చిగురుపాటి జయరాం కేసు: శిఖాచౌదరికి ఊరట, పోలీసుల క్లీన్‌చిట్

Siva Kodati |  
Published : May 01, 2019, 10:28 AM IST
చిగురుపాటి జయరాం కేసు: శిఖాచౌదరికి ఊరట, పోలీసుల క్లీన్‌చిట్

సారాంశం

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన మేనకోడలు శిఖా చౌదరికి పెద్ద ఊరట లభించింది. 

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన మేనకోడలు శిఖా చౌదరికి పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు.

మంగళవారం ఉదయం పోలీసులు 388 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మొత్తం 70 మందిని విచారించిన పోలీసులు..రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్, సూర్యప్రసాద్, కిశోర్, విశాల్, నగేశ్, అంజిరెడ్డి, సుభాష్ రెడ్డిలపై ఛార్జ్‌షీటు దాఖలు చేశారు.

ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీ కృష్ణాజిల్లా నందిగామ వద్ద ఆయన కారు జాతీయ రహదారి పక్కన పొలాల్లో పడివుంది. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదు చేసినప్పటికీ తర్వాత హత్యగా నిర్ధారించారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్