వేరే వాళ్లతో చనువుగా ఉంటోందని: మహిళా కానిస్టేబుల్‌ను చంపిన కానిస్టేబుల్

Siva Kodati |  
Published : May 01, 2019, 09:06 AM IST
వేరే వాళ్లతో చనువుగా ఉంటోందని: మహిళా కానిస్టేబుల్‌ను చంపిన కానిస్టేబుల్

సారాంశం

హైదరాబాద్ ఆర్సీ పురంలో దారుణం చోటు చేసుకుంది. తనతో పాటు పనిచేసే మహిళా కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేశాడో కానిస్టేబుల్.

హైదరాబాద్ ఆర్సీ పురంలో దారుణం చోటు చేసుకుంది. తనతో పాటు పనిచేసే మహిళా కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేశాడో కానిస్టేబుల్. ప్రకాశ్ అనే వ్యక్తి సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

ఇదే పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. అయితే ఆమె వేరే వాళ్లతో చనువుగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఆమెను నమ్మించి బయటకు తీసుకెళ్లిన ప్రకాశ్ దారుణంగా హతమార్చాడు. దీంతో కానిస్టేబుల్ ప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్