అనుమానించండి.. మాకు సహకరించండి.. ఫ్రాడ్ ను అరికట్టండి.. : అంజనీకుమార్ (వీడియో)

By AN TeluguFirst Published Jan 22, 2021, 3:33 PM IST
Highlights

హైదరాబాద్ మహా నగరంలో పెరిగిపోతున్న నేరాలను, మోసాలను అరికట్టడానికి ప్రజలు పోలీసులతో చేతులు కలపాలని పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. 

హైదరాబాద్ మహా నగరంలో పెరిగిపోతున్న నేరాలను, మోసాలను అరికట్టడానికి ప్రజలు పోలీసులతో చేతులు కలపాలని పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. 

"

నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిథిలో ఇటీవల ఓ కొత్తరకం కేసు నమోదయ్యిందని చెప్పారు. ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పేరుతో ఉన్న ఓ వాహనాన్ని నల్లకుంట పోలీసులు ఆపారని, ప్రభుత్వ గుర్తుతో ఉన్న ఈ వాహనం గురించి ఆరా తీస్తే అసలు అలాంటి సంస్థ ఏదీ దేశంలో ఎక్కడా లేదని తేలిందన్నారు. 

ఇలా ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో, రకరకాల చీటింగులు జరుగుతున్నాయని, వీటి బారిన పడి  ఎందరో అమాయకులు మోసపోతున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వారిని నమ్మొద్దని, అనుమానం వస్తే వెంటనే ఆ వాహనం ఫొటో తీసి పోలీస్ కంట్రోల్ రూం. నెం. 9490616555 కు వాట్సాప్ పంపించాలని అన్నారు. 

దానిమీద తాము రీసెర్చ్ చేసి అది నిజంగా ఉందో, లేదో కనిపెడతామని తద్వారా నేరాలను, మోసాలను అరికట్టవచ్చని అన్నారు. పోలీసులు, ప్రజలు కలిసి పనిచేస్తేనే ఇలాంటివి సాధ్యమని, ప్రజలు ఇలాంటి వాటిలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

click me!