హైద్రాబాద్ మియాపూర్ లో దారుణం: యువతిపై కత్తితో దాడి, ఆత్మాహత్యాయత్నం చేసిన యువకుడు

By narsimha lode  |  First Published Dec 13, 2022, 12:43 PM IST

హైద్రాబాద్ మియాపూర్  ఆదిత్యనగర్ లో  మంగళవారం నాడు  దారుణం చోటు  చేసుకుంది.  యువతిపై కత్తితో దాడి చేసి  సందీప్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  యువతిపై దాడిని అడ్డుకున్న తల్లి కూడా ఈ సమయంలో గాయపడింది. 


హైదరాబాద్: నగరంలోని  మియాపూర్  ఆదిత్యనగర్ లో యువతిపై కత్తితో దాడి చేశాడు సందీప్ అనే యువకుడు,. ఈ దాడిిని యువతి తల్లి అడ్డుకుంది. దీంతో ఆమె గాయపడింది. తల్లీ కూతుళ్లను గాయపర్చిన తర్వాత సందీప్ కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ముగ్గురిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

గతంలో  సందీప్ కి ,యువతికి మధ్య నిశ్చితార్ధం జరిగిందని  డీసీపీ శిల్పవల్లి చెప్పారు.సందీప్ ప్రవర్తన నచ్చకపోవడంతో  ఈ ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.యువతికి మరో యువకుడితో  ఎంగేజ్ మెంట్ జరిగింది.ఈ విషయం తెలుసుకున్న సందీప్ యువతిపై కక్ష పెంచుకున్నాడని డీసీపీ తెలిపారు. ఇవాళ ఉదయం  యువతి ఇంట్లో కి వచ్చి విచక్షణరహితంగా కత్తితో దాడి చేసినట్టుగా డీసీపీ శిల్పవల్లి చెప్పారు. ఈ సమయంలో అడ్డు పడిన యువతి తల్లిపై నిందితుడు  సందీప్ దాడి చేశాడన్నారు.  అనంతరం సందీప్  గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా  డీసీపీ వివరించారు.సందీప్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని  డీసీపీ తెలిపారు. 

Latest Videos

గతంలో  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహాలో  దాడులు జరిగిన  ఘటనలు  చోటు  చేసుకున్నాయి.ముషీరాబాద్ భోలక్ పూర్ బస్తీకి  చెందిన  యువతి ఓ ప్రైవేట్ మెడికల్ దుకాణంలో  పనిచేస్తుంది.  అదే బస్తీకి చెందిన  రంజిత్ ప్రేమ పేరుతో  యువతిని వేధిస్తున్నాడు. మాట్లాడుదామని చెప్పి ఓయూలోని  మానేరు హస్టల్ వద్దకు  యువతిని తీసుకొచ్చి  కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన ఈ ఏడాది సెప్టెంబర్ 22న జరిగింది

తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో  నల్గొండలో  రోహిత్ అనే యువకుడు యువతిపై  కత్తితో దాడి చేశాడు.  ఈ ఘటన ఈ ఏడాది ఆగష్టు  10వ తేదీన జరిగింది.  స్నేహితురాలితో  యువతిని  రోహిత్  పార్క్ వద్దకు పిలిపించి ఈ దాడి  చేశాడు.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన  యువతి ఆసుపత్రిలో చికిత్స పొందింది.  యువతిని  గాయపర్చిన  రోహిత్ ను  పోలీసులు అరెస్ట్  చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కృష్ణా జిల్లాలో ఓ ప్రేమోన్మాది ప్రియురాలితో పాటు  ప్రియురాలి చెల్లెళ్లపై కూడా  కత్తితో దాడి చేశాడు.ఈ ఘటన  ఈ ఏడాది జూలై 15న జరిగింది. బాధితులు  కేకలు వేయడంతో  నిందితుడు జోయల్  పారిపోయాడు. ప్రేమ పేరుతో  తనను వేధించవద్దని బాధితురాలు జోయల్ ను కోరింది. అయినా వినకుండా వేధింపులకు పాల్పడినట్టుగా బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

click me!