న్యూఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ఫ్లెక్సీలను తొలగించినట్టుగా మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ:దేశ రాజధాని న్యూఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు మంగళవారంనాడు తొలగించారు. న్యూఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎన్‌డీఎంసీ అధికారులు తొలగించారు. ఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్డులో బీఆర్ఎస్ కు తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని రేపు కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై మున్సిపల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో ఫ్లైక్సీలను ఒక్క చోట పేర్చారు. టీఆర్ఎస్ ఎంపీలు, కేసీఆర్ నివాసం వద్ద కూడ ఫ్లెక్సీలను సిద్దం చేశారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై న్యూఢిల్లీ మున్సిపల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
also read:ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్: మూడు రోజులు హస్తినలోనే మకాం
undefined
న్యూఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఇవాళ, రేపు కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యాలయంలో రాజశ్యామల యాగాన్ని కేసీఆర్ నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు గాను రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ఈ యాగం ఏర్పాటు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు కార్యక్రమంలో సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ , రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ తదితరులు హాజరు కానున్నారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఈ తీర్మానం కాపీని ఈసీకి పంపారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఈసీ కేసీఆర్ కు లేఖను పంపింది. ఈ నెల 9వ తేదీన ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ సంతకం చేశారు.ఈ లేఖను ఈసీకి పంపారు కేసీఆర్. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.