కేసీఆర్ కు అల్లుడంటే భయం

Published : Nov 06, 2016, 09:24 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కేసీఆర్ కు అల్లుడంటే భయం

సారాంశం

తనయుడిని సీఎం చేయడమే ఆయన లక్ష్యం అందుకే వాస్తు పేరుతో కూల్చివేతలు తెలంగాణ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి  

ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి హారీశ్ రావు అంటే భయమని, అల్లుడు ఎక్కడ తన పదవికి ఎసరు పెడతాడేమోనని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ సీఎం కావాలనే ఆలోచనతోనే సచివాలయాన్ని కూల్చివేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి కొడుకు సీఎం కాలేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఇప్పుడు అదే విధంగా హరీష్ కూడా సీఎం అవుతారేమోననే భయం కేసీఆర్ కు పట్టుకుందని.. అందుకోసమే వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చాలనుకుంటున్నారని తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం