తెలంగాణ ఎన్నికలపై జనసేన అనూహ్య నిర్ణయం

Published : Nov 19, 2018, 04:35 PM IST
తెలంగాణ ఎన్నికలపై జనసేన అనూహ్య నిర్ణయం

సారాంశం

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై రెండు రోజుల్లో ప్రకటిస్తానని గతంలో చెప్పిన జనసేన  అధినేత పవన్.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. 

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై రెండు రోజుల్లో ప్రకటిస్తానని గతంలో చెప్పిన జనసేన  అధినేత పవన్.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. అయితే.. వచ్చే సంవత్సరం జరగనున్న పార్లమెంట్ స్థానాలకు మాత్రం పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో ఎన్నికలు ముందుగానే రావడంతో.. నూతనంగా ఏర్పడిన తమ పార్టీకి అభ్యర్థులను ఎంపిక చేయడం కష్టమని పవన్ పేర్కొన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండి.. పార్లమెంట్ స్థానాలకు మాత్రం పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు జనసేన కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడానికి ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నామని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?