కేసీఆర్ కే ఓటు వేస్తాం, తెలంగాణను గెలిపిస్తాం.. అనేటోళ్లకే దళితబంధు.. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

దళితబంధు లబ్ధి దారుల ఎంపిక మీద జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ సోయి ఉంటేనే దళితబంధు అంటూ వ్యాఖ్యానించారు


చేర్యాల : ‘ రాంసాగరా..? పంపివ్వు, ఒకటో రెండో ఉంటే పెడదాం. అర్హులు ఎవరైనా ఉంటే.. తెలంగాణ సోయి ఉన్నోళ్లు.. అర్థమైంది కదా.. దాపరికం లేదు.. ఎందుకు ఉండాలి.. నీళ్లిస్తుండ్రు కదా.. అంతకు ముందు నీళ్లు లేవు కదా.. కరెంటు లేకుండే కదా, ఎదిగిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు సర్కారు పైసలిస్తుంది కదా.. గర్భిణీలకు రూపాయి ఖర్చు లేకుండా ప్రసూతి చేస్తున్నాం కదా, ఉల్టా పైసలు కూడా ఇస్తున్నాం కదా.. ఇవన్నీ నష్టమా, లాభమా తెలంగాణకు.. 

అట్లా కాబట్టి.. ఆ సోయున్నోళ్లుంటే పెట్టియ్యి.. ఆ సోయి లేకుంటే పెట్టకు.. కేసీఆర్ కే ఓటు వేస్తాం.. తెలంగాణ గెలిపిస్తాం.. అనేటోళ్లు ఉంటే పెట్టు.. ఓపెన్ సీక్రెట్ ఇది. దాపరికం లేదు ’ అని Dalitha Bandhu పథకం లబ్ధిదారుల ఎంపిక గురించి మాట్లాడుతూ జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలం సర్వసభ్య సమావేశంలో దళిత బంధు తమ గ్రామంలో లేదని రాంసాగర్ సర్పంచ్ రవీందర్ సభ దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే పై విధంగా స్పందించారు. 

Latest Videos

12 మంది ఎమ్మెల్యేలు జంప్.. నేను సీఎల్పీగా వుంటే, ప్రజల ఫీడ్‌బ్యాక్‌తోనే నా రాజీనామా : తేల్చేసిన రాజగోపాల్ రెడ్

ఇదిలా ఉండగా, ఈ ఏప్రిల్ లో అంబేద్కర్ జన్మదిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్  మాట్లాడుతూ.. టాలెంట్ ఎవరడబ్బా సొత్తు కాదన్నారు. ప్రపంచంలో రెండే రెండు కులాలున్నాయని.. ఒకటి డబ్బున్న కులం, ఇంకోటి డబ్బు లేని వారి కులం అని కేటీఆర్ చెప్పారు. దళితబంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 17,700 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. దళిత బంధు పథకంపై కొందరు నేతలు కావాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని రాష్ట్ర విపక్షాలపై కేటీఆర్ సెటైర్లు వేశారు.

బీజేపీ మత చిచ్చుపెట్టి  రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నాలు చేస్తుందనిమండిపడ్డారు. ఎవరేం తినాలో ఏం తినొద్దో కూడా బీజేపీనే చెబుతుందన్నారు. దిక్కుమాలిన రాజకీయాలు బీజేపీ చేస్తుందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రజలకుఏ సమస్యలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. 

click me!