Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తామనీ, 32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన నేతలు ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల జనసేన-బీజేపీ రెండు పార్టీల మధ్య ఉమ్మడి పోటీ లాభిస్తుందని భావిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు పవన్ కళ్యాణ్ తో పొత్తుపై చర్చించారు.
Jana Sena president Pawan Kalyan: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్ ల మధ్య పోరు తీవ్రంగా ఉంటుందని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో పలువురు విశ్లేషకులు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్రంలో త్రిముఖ పోరు తప్పదని అభిప్రాయపడుతున్నారు. అయితే, జనసేన సైతం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడం, దీనికి అనుగుణంగా బీజేపీతో కలిసి ముందుకు సాగుతామనే సంకేతాలు పంపుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారియి.
ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ. కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తో కలిసి బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ఆ పార్టీకి చెందిన వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు పార్టీల మధ్య పొత్తుపై చర్చించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌లతో కలిసి బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలతోపాటు ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలపై ఈ భేటీలో చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.
undefined
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తామనీ, 32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన నేతలు ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల జనసేన-బీజేపీ రెండు పార్టీల మధ్య ఉమ్మడి పోటీ లాభిస్తుందని భావిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు పవన్ కళ్యాణ్ తో పొత్తుపై చర్చించారు. తెలంగాణ ఎన్నికల్లో పొత్తు, ఎలా ముందుకు వెళ్లాలనే వ్యూహంపై బుధవారం నాటి భేటీలో స్పష్టత రానుంది. గత వారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు పవన్ కళ్యాణ్ తో సమావేశమై పొత్తుపై ప్రాథమిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది తేలాల్సి ఉంది.
ఈ భేటీలో ఏపీ రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తో కలిసి ముందుకు సాగుతామనీ, రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. జనసేన-బీజేపీలు మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే, టీడీపీ బీజేపీతో ఇప్పటికే తన దోస్తాన్ ను కట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి ఏపీలో కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణలోనూ ఇదే జరగవచ్చనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.