మునుగోడు బైపోల్ 2022: తూఫ్రాన్ ‌పేట వద్ద రూ. 90 లక్షలు సీజ్

By narsimha lode  |  First Published Nov 1, 2022, 8:30 PM IST


చౌటుప్పల్ మండలంలోని  తూఫ్రాన్  పేట చెక్  పోస్టు వద్ద వాహనాల తనిఖీలో భాగంగా  రూ.90  లక్షలను  పోలీసులు సీజ్  చేశారు. స్కార్పియో  వాహనంలో ఈ  నగదును తరలిస్తున్న సమయంలో పోలీసులు  సీజ్  చేశారు.


చౌటుప్పల్: మండలంలోని  తూప్రాన్ పేట చెక్ పోస్టు వద్ద  మంగళవారంనాడు  వాహనాల తనిఖీలమ సమయంలో  రూ.90 లక్షలను  పోలీసులు సీజ్  చేశారు. మునుగోడు ఉప ఎన్నికను పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ  జిల్లాలో  చెక్  పోస్టులు ఏర్పాటు చేశారు.జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద  వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం తూఫ్రాన్  పేట వద్ద ఏర్పాటు  చేసిన చెక్ పోస్టు వద్ద  వాహనాలను తనిఖీ  చేస్తున్న  సమయంలో  స్కార్పియోలో తరలిస్తున్న రూ.90 లక్షలను పోలీసులు  సీజ్  చేశారు.

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో లెక్కచూపని రూ.6.80  కోట్ల నగదును సీజ్  చేసినట్టుగా అధికారులు  ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంతో పాటు , హైద్రాబాద్ నగరంలో కూడా భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల సమయంలో భారీగా నగదు పట్టుబడింది.

Latest Videos

గత నెల 31న  జూబ్లీహిల్స్  పోలీస్ స్టేషన్ లో వాహనాలు తనిఖీ  చేస్తున్న సమయంలో రూజ90 లక్షలను  పోలీసులు  సీజ్  చేశారు. కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు ఈ వాహనాన్ని తనిఖీ చేయగా డబ్బు బయటపడింది. ఈ నగదుకు   సంబంధించి సరైన  ఆధారాలు చూపకపోవడంతో  నగదును సీజ్  చేసినట్టుగా  పోలీసులు తెలిపారు.

ఈ  ఏడాది అక్టోబర్ 23న  హైద్రాబాద్ లో రూ.70 లక్షలను పోలీసులు  సీజ్ చేశారు.బేగంబజార్ నుండి  కొందరు మునుగోడుకు డబ్బులు తరలిస్తున్నారనే సమాచారం  మేరకు  వాహనాలు తనిఖీలు  చేశారు.  కోఠి వద్ద కారులో రూ.70 లక్షలను తరలిస్తుండగా  పోలీసులు ఆ నగదును సీజ్  చేశారు.అదే రోజున మరో రూ.10 లక్షలను  పంజాగుట్ట  పోలీస్  స్టేషన్  పరిధిలో పోలీసులు  సీజ్  చేశారు.


ఈ  నెల 11న  హైద్రాబాద్ బంజారాహిల్స్ లో రూ. 2 కోట్ల విలువైన హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు.  నాలుగు రోజుల వ్యవధిలో హైద్రాబాద్ లో రూ. 10 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.  నగరానికి  చెందిన  వ్యాపారికి  చెందిన నగదుగా  పోలీసులు గుర్తించారు. ఈ నెల  10న  హైద్రాబాద్ గాంధీ నగర్ లో భారీగా నగదును సీజ్ చేశారు. రూ. 3.5 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు..  వాహనాలను తనిఖీలు చేసే సమయంలో కారులో నగదును తరలిస్తుండగా పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు. 

 అక్టో బర్  7న జూబ్లీహిల్స్ లో రూ. 50లక్షలను  హవాలా రూపంలో తరలిస్తున్న సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. అక్టోబర్ 8వ తేదీన పాతబస్తీలో రూ.79 లక్షలను పోలీసులు సీజ్  చేశారు.అక్టోబర్ 9వ తేదీన హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో రూ. 2.5 కోట్ల విలువైన నగదును పోలీసులు సీజ్ చేశారు. 

alsop read:మునుగోడులో రూ. 6.80కోట్ల నగదు సీజ్,185 కేసులు: తెలంగాణ సీఈఓ వికాస్ రాజు

 అక్టోబర్ 21న  హైద్రాబాద్  నగరంలో  సుమారు  కోటికిపైగా  నగదును  పోలీసులు సీజ్  చేశారు. నలుగురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు నగదును  తరలిస్తున్న  కారుతో పాటు  నలుగురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు.

click me!