ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంది: తెలంగాణ హైకోర్టులో పిటిషన్

By narsimha lode  |  First Published Nov 1, 2022, 10:24 PM IST

ఎమ్మెల్యేలు,సామాన్యుల  ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్  చేస్తుందని  తంగెళ్ల శివప్రసాద్ అనే వ్యక్తి హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.  


హైదరాబాద్:తెలంగాణ  ప్రభుత్వం ఫోన్లను ట్యాపింగ్  చేస్తుందని తంగెళ్ల  శివప్రసాద్ మంగళవారంనాడు హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 4వ  తేదీన ఈ పిటిషన్ ను విచారిస్తామని  హైకోర్టు  తెలిపింది. సామాన్యులు,  ఎమ్మెల్యేల  ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

తెలంగాణ  ప్రభుత్వం తమ  ఫోన్లను ట్యాప్  చేస్తుందని  బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి కూడ  ఈ తరహ  ఆరోపణలు  చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ  ఫొన్లను ట్యాప్  చేస్తుందని ఆయన  గతంలో  ఆరోపించిన విషయం తెలిసిందే.

Latest Videos

undefined

మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ,బీజేపీ మధ్య   విమర్శలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి  చేరుకున్నాయి. ఇదే సమయంలో  మొయినాబాద్  ఫాంహౌస్ ఘటన రెండు పార్టీల మధ్య  మరింత అగ్గిని  రాజేసింది. మొయినాబాద్  ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించారని  ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు  ప్రస్తుతం  అరెస్టై జైలులో  ఉన్నారు. ఈ  విషయమై రెండు ఆడియో  సంభాషణలు బయటకు వచ్చాయి. 

గత నెల 30వ  తేదీన చండూరులో నిర్వహించిన  ఎన్నికల  సభలో మొయినాబాద్  ఫాంహౌస్ ఘటన గురించి  సీఎం  కేసీఆర్  కొన్ని  అంశాలను వివరించారు. ఈ కేసు కోర్టులో  ఉన్నందున తాను ఎక్కువగా మాట్లాడబోనని  ఆయన  చెప్పారు.తెలంగాణలో ఫోన్ల ట్యాపింగ్  జరుగుతుందని  తంగెళ్ల శివప్రసాద్ ఈసీకి కూడ ఫిర్యాదు చేశారు. 

click me!