జగిత్యాల మాస్టర్ ప్లాన్: అంబారీపేట గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద మహిళల నిరసన

By narsimha lodeFirst Published Jan 17, 2023, 12:50 PM IST
Highlights

జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  అంబారీపేట గ్రామపంచాయితీ కార్యాలయం ఎక్కి మహిళా రైతులు నిరసనకు దిగారు.
 

జగిత్యాల: జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ అంబారి పేట   గ్రామపంచాయితీ కార్యాలయం ఎక్కి మహిళా రైతులు  మంగళవారంనాడు  నిరసనకు దిగారు. మాస్టర్ ప్లాన్ ను  వెనక్కి తీసుకోవాలని  ఆందోళనకారులు  డిమాండ్  చేశారు.జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇవాళ జగిత్యాల  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటి ముందు  మహిళా రైతులు ఆందోళన నిర్వహించారు.  ఒక్క ఎకరం భూమి కూడా కోల్పోకుండా  చూస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మహిళా రైతులకు  హామీ ఇచ్చారు.

మరోవైపు అంబారి పేట గ్రామపంచాయితీ కార్యాలయం ఎక్కి  మహిళలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే, కలెక్టర్ వచ్చి తమ డిమాండ్లపై  స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్  చేశారు.  జగిత్యాల మాస్టర్ ప్లాన్  విషయమై  విలీన గ్రామాల  రైతులు  ఆందోళనలను ఉధృతం  చేస్తున్నారు. జగిత్యాల-నిజామాబాద్  రహాదారిపై   రైతులు ఆందోళన నిర్వహించారు.  

also read:కామారెడ్డి మాస్టర్ ప్లాన్: భవిష్యత్తు కార్యాచరణపై రైతు జేఏసీ భేటీ

జగిత్యాల మాస్టర్ ప్లాన్ లో పరిధిలోకి నర్సింగాపూర్,  కండ్లపల్లి,  తిమ్మాపూర్,  తిప్పన్నపేట, హుస్నాబాద్, లింగంపేట, మోతె.గ్రామాలను చేర్చాలనే ప్రతిపాదన  ఉంది. . భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని  మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం సిద్దం చేస్తుంది.  అయితే  మాస్టర్ ప్లాన్ కు అవసరమైన  భూములను సేకరించనుంది.  దీంతో  భూములు కోల్పోతామనే గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన బాట పట్టారు.  
 

click me!