జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ జగిత్యాల కలెక్టరేట్ ముందు రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
జగిత్యాల: జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ విలీన గ్రామాలకు చెందిన రైతులు కలెక్టరేట్ ముందు మంగళవారం నాడు ధర్నాకు దిగారు. ఈ ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ వచ్చి తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరారు.జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతులు ఏ రకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారో జగిత్యాల రైతులు కూడా ఆందోళనలు చేపట్టారు. గతంలో జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. నిన్న జగిత్యాల-నిజామాబాద్ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
ఇవాళ అంబారీపేటలో మహిళా రైతులు గ్రామపంచాయితీ ఎక్కి ఆందోళన నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటి వద్ద మహిళా రైతులు ఆందోళనకు దిగారు. మాస్టర్ ప్లాన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఒక్క ఎకరం భూమిని కోల్పోకుండా చూస్తామని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు ఆంోళనను కొనసాగిస్తామని రైతులు చెబుతున్నార.పరిశ్రమల ఏర్పాటుకు తమ భూములు తీసుకొంటే ఎలా బతుకుతామని విలీన గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ ఉపాధి దెబ్బతీసే మాస్టర్ ప్లాన్ వద్దని రైతులు తేల్చి చెబుతున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతు జేఏసీ ఆద్వర్యంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
also read:జగిత్యాల మాస్టర్ ప్లాన్: అంబారీపేట గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద మహిళల నిరసన
జగిత్యాల మాస్టర్ ప్లాన్ లో పరిధిలోకి నర్సింగాపూర్, కండ్లపల్లి, తిమ్మాపూర్, తిప్పన్నపేట, హుస్నాబాద్, లింగంపేట, మోతె.గ్రామాలను చేర్చాలనే ప్రతిపాదన ఉంది. . భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం సిద్దం చేస్తుంది. అయితే మాస్టర్ ప్లాన్ కు అవసరమైన భూములను సేకరించనుంది. దీంతో భూములు కోల్పోతామనే గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన బాట పట్టారు.