Jagityala: 'గుడి గంట‌లే.. బ‌డి గంట‌లు'.. ప్రమాదపుటంచులో ప్రభుత్వ పాఠశాల.. విధిలేని ప‌రిస్థితిలో గుడిలో పాఠాలు

By Rajesh KFirst Published Jul 18, 2022, 9:07 PM IST
Highlights

Jagityala : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీ రాంనగర్ కు చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల  భవనం పూర్తిగా శిథిలమై పోయింది. పెచ్చులూడి పడుతుండడంతో విద్యార్థుల‌కు చ‌దువుకు ఆటంకం క‌లుగ‌కుండా.. పాఠ‌శాల ఎదుటే ఉన్న గుళ్లో పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయుడు.  
 

Jagityala: గుడిలో గంటలు మోగితే..  భక్తులు దర్శనం చేసుకుంటున్నారనుకుంటాం... ఆ ఊర్లో అలా అనకుంటే.. పొర‌పాటే..  ఆ ఊరి గుడి గంట‌లే.. బడి గంటలు మారాయి. అయ్యవార్ల మంత్రోచ్ఛారణల నడుమ పూజలు అందుకునే హనుమంతుని సన్నిధిలో విద్యార్థులు పాఠశాల‌గా మ‌రింది. ఆ గుడి మండ‌ప‌మే వారిని త‌ర‌గ‌తిగ‌ది గా మారింది. ఆ ఆల‌య ప్రాంగణమే క్రీడా మైదానమైంది. ఇలా  నానా అవస్థలు ప‌డుతూ.. జ‌గిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శ్రీరాంనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు.

జ‌గిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శ్రీరాంనగర్  ప్రభుత్వ ప్రాథమికపాఠశాల భ‌వ‌నం శిథిలావస్థలకు చేరుకుంది. గ‌త వారాలుగా కురుస్తున్న‌ వర్షానికి పెచ్చులు ఊడి పడిపోయాయి. గదుల్లోకి తేమ రావడంతో విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఎప్పుడు ఎక్క‌డ కూలుతుందో? ఎప్పుడు ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని  ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళ‌న చెందుతున్నారు.  ఈ క్ర‌మంలో విద్యార్థుల‌కు చ‌దువుకు ఆటంకం క‌లుగ‌కుండా.. పాఠ‌శాల ఎదుటే ఉన్న గుళ్లో పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయుడు.  
 
ఈ క్ర‌మంలో అధికారులు నిద్రావస్థలో ఉన్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్వ‌ర‌మే నూతన భవ‌నం నిర్మించాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రమాదం జరిగితే బాధ్యులెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం శ్రీ రాంనగర్ కు చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుస్థితిపై ఏషియ‌న్ నెట్ తెలుగు న్యూస్ (asianet telugu news) ప్రత్యేక కథనం..

ఇది జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీ రాంనగర్ కు చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠ‌శాల‌లో 1నుంచి 5వ తరగతులున్నాయి. ప్ర‌స్తుతం పాఠ‌శాల‌లో 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాల భవనం ప్రమాదపుటంచులో ఉండ‌టంతో  శ్రీరాంనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హనుమంతుని ఆలయాన్ని ఆశ్రయించారు. 

చిన్న వర్షం వస్తే చాలు .. పాఠ‌శాల గోడలు నెమ్మెక్కి చిత్తడిగా మారుతున్నాయి. ఎప్పడు కూలిపోతాయో తెలియని అయోమయం. విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదమని భావించి తరగతులను బడి నుండి గుడికి మార్చేశారు. ఈ పాఠశాల భవనాన్ని1996లో నిర్మించారు. ఇటీవ‌ల వ‌ర్షాలకు భవనంపై పెచ్చులు ఊడిపోయాయి. చాలు తరగతి గదులు ఊరుస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇదే భవనంలో తరగతులు కొనసాగించడం మంచిది కాదని భావించిన టీచర్లు పక్కనే ఉన్న హనుమాన్ మందిరం ఆవరణలో పాఠాలు బోధిస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. శిథిలమైపోతున్న పాఠశాల భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మిస్తే తప్ప వర్షాకాలం చదువులు చెప్పే పరిస్థితి లేదని అంటున్నారు.

click me!