జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కి కరోనా

By narsimha lodeFirst Published Oct 13, 2020, 5:21 PM IST
Highlights

జగిత్యాల ఎమ్మెల్యే  డాక్టర్ సంజయ్ కు కరోనా సోకింది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో ఆయన కరోనా పరీక్షలు చేయించుకొన్న సమయంలో ఆయనకు కరోనా నిర్ధారణ అయింది.

హైదరాబాద్: జగిత్యాల ఎమ్మెల్యే  డాక్టర్ సంజయ్ కు కరోనా సోకింది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో ఆయన కరోనా పరీక్షలు చేయించుకొన్న సమయంలో ఆయనకు కరోనా నిర్ధారణ అయింది.

గత రెండు రోజులుగా ఆయన పలువురిని కలిసినట్టుగా సమాచారం. వారందరూ కూడ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. 

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  సోమవారం నాడు కవిత విజయం సాధించారు. కవితను ఆయన కలిసి అభినందించారు. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా రోగులకు సేవలందించిన విషయం తెలిసిందే.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగిత్యాల అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి డాక్టర్ సంజయ్ గెలుపు కోసం కవిత విస్తృతంగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో కవితను కలిసి ఆమెను అభినందించారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, కోరుకంటి చందర్, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, కేపీ వివేకానంద్ , ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు కరోనా బారినపడి కోలుకొన్న విషయం తెలిసిందే.

click me!