దొంగబాబా.. తళ్లీ కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడి..

Published : Oct 13, 2020, 03:59 PM IST
దొంగబాబా.. తళ్లీ కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడి..

సారాంశం

ఇద్దరికీ మత్తుమందు ఇచ్చి ఒకరి తర్వాత మరొకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. కాగా.. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో.. దొంగ బాబా లీలలు బయటకు వచ్చాయి.

తాను ఒక బాబా అని.. తన దగ్గర అతీతమైన శక్తులు ఉన్నాయంటూ నమ్మించి.. ఓ వ్యక్తి దారుణాలకు పాల్పడ్డాడు. భూత వైద్యం పేరిట తళ్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇప్పటి వరకు  చాలా మందిపై ఇలాంటి దారుణాలకు పాల్పడగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పూసల గల్లీలో ఐదేళ్ళ నుంచి భూత వైద్యం మెడిటేషన్ పేరుతో బాబా ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు. మెడిటేషన్, క్షుద్ర పూజలు, ఆత్మల ప్రవేశం అంటూ అనారోగ్య సమస్యలు తీరుస్తానని మహిళలను లొంగదీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపతున్న మెట్‌పల్లికి చెందిన తల్లీ, కూతురు ఇటీవల బాబాను ఆశ్రయించారు.

వారికి మాయమాటలు చెప్పి.. వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరికీ మత్తుమందు ఇచ్చి ఒకరి తర్వాత మరొకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. కాగా.. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో.. దొంగ బాబా లీలలు బయటకు వచ్చాయి. 

దారుణాన్ని తెలుకుని బాధితులు మహిళా సంఘాలను ఆశ్రయించడం బాబా బాగోతం బయటపడింది. దీంతో దొంగ బాబా కార్యాలయానికి వచ్చిన మహిళా సంఘాల ప్రతినిధులు కామాంధుడిని చితకబాదారు. చెప్పులు, చీపుర్లతో కిందపడేసి కసితీరా కొట్టారు. మరోవైపు బాబా బాగోతాలు ఒక్కొక్కటిగా  బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం దొంగబాబా పోలీసుల అదుపులో ఉండగా.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజా ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల జీవితాలతో ఆటలాడుతున్న ప్రబుద్ధిడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు

PREV
click me!

Recommended Stories

Jayalalitha Assets: హైదరాబాద్‌లో జయలలిత భవనానికి GHMC సీల్.. అసలు కారణం ఇదే | Asianet News Telugu
హైదరాబాద్‌లో హనుమజ్జయంతి వేడుకలు.. అంజన్నకు సజ్జనార్ పూజలు | Asianet News Telugu