సంగారెడ్డి అంటే జగ్గారెడ్డే: జయారెడ్డి

Published : Oct 15, 2018, 03:26 PM IST
సంగారెడ్డి అంటే జగ్గారెడ్డే: జయారెడ్డి

సారాంశం

సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి... జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని  మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి చెప్పారు.

సంగారెడ్డి: సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి... జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని  మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా  సంగారెడ్డి  నియోజకవర్గంలో ఆమె  తన తండ్రి  తరపున  విస్తృతంగా ప్రచారం  నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం నాడు జయారెడ్డి టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని  కేసీఆర్ విమర్శించడం సమంజసమేనా అని ఆమె ప్రశ్నించారు.  సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ సీఎం అయ్యేవాడా అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి పదవులు వచ్చేవా అని ఆమె ప్రశ్నించారు.

 బతుకమ్మను తానే కనిపెట్టినట్టు కవిత మాట్లాడుతున్నారని  జయారెడ్డి విమర్శించారు. కవిత పుట్టకముందే   బతుకమ్మ ఆడేవారని ఆమె గుర్తు చేశారు.   సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.... జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని ఆమె గుర్తు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu