కేఈతో బంధుత్వం నిజమే,.. కానీ అదే కారణం కాదు: నందీశ్వర్ గౌడ్

Published : Oct 15, 2018, 03:13 PM IST
కేఈతో బంధుత్వం నిజమే,.. కానీ అదే కారణం కాదు: నందీశ్వర్ గౌడ్

సారాంశం

: తనకు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో ఉన్న బంధుత్వం ఉన్న కారణంగానే తాను  టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నానని చెప్పడంలో  వాస్తవం లేదని  పటాన్‌చెరువు మాజీ  ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చెప్పారు.


హైదరాబాద్: తనకు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో ఉన్న బంధుత్వం ఉన్న కారణంగానే తాను  టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నానని చెప్పడంలో  వాస్తవం లేదని  పటాన్‌చెరువు మాజీ  ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చెప్పారు.

సోమవారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  తాను 1987లో  పటాన్‌చెరువు ఎంపీగపీగా ఎన్నిక కావడానికి  ఎన్టీఆర్   కారణమన్నారు.తొలిసారిగా తాను పటాన్‌చెరువు ఎంపీపీగా ఎన్నిక కావడానికి ఎన్టీఆర్ తీసుకొచ్చిన రిజర్వేషన్లు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. 

అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును తాను కలిసిన మాట వాస్తవమేనని  నందీశ్వర్‌గౌడ్ చెప్పారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా తాను  పనిచేస్తానని  నందీశ్వర్ గౌడ్ చెప్పారు. ఈ నెల 19వ తేదీన ఎల్. రమణ సమక్షంలో అనుచరులతో కలిసి తాను టీడీపీలో చేరుతానని  ఆయన ప్రకటించారు. 

ఏపీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి తనకు బంధుత్వం ఉందని చెప్పారు.ఈ కారణంగానే తాను టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోలేదన్నారు.ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్


 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌