హస్తినలో వరుస భేటీలు: రాహుల్‌తో జగ్గారెడ్డి భేటీ

Published : Apr 06, 2022, 04:56 PM ISTUpdated : Apr 06, 2022, 05:00 PM IST
హస్తినలో వరుస భేటీలు: రాహుల్‌తో జగ్గారెడ్డి భేటీ

సారాంశం

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం నాడు రాహుల్ తో భేటీ అయ్యారు. రాహుల్ తో భేటీ సమయంలో రాష్ట్రంలో పార్టీ వ్యవహరాలను చర్చించనున్నారు.


న్యూఢిల్లీ: టీపీసీసీ  వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం నాడు ఎఐసీసీ మాజీ చీఫ్ Rahul Gandhi తో భేటీ అయ్యారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి KC Venugopal తో  భేటీ అయిన విషయం తెలిసిందే.

ఈ నెల 4వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ నేతలు  రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం లోనే Revanth Reddy తో తనకు గల అభిప్రాయబేధాలను జగ్గారెడ్డి వివరించే ప్రయత్నం చేశారని సమాచారం. మరో వైపు ఈ విషయమై కేసీ వేణుగోపాల్ తో కలిసి వివరించాలని కూడా రాహుల్ గాంధీ సూచించారు. 

అయితే రేవంత్ రెడ్డి  రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై మట్లాడే సమయంలో జగ్గారెడ్డికి తనకు మధ్య గ్యాప్ విషయాన్ని ప్రస్తావించారని తెలిసింది. రానున్న రోజుల్లో తమ మధ్య గ్యాప్ ను  తగ్గించేందుకు ప్రయత్నిస్తానన్నారు. పార్టీ నేతలంతా కలిసికట్టుగా పని చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఇదిలా ఉంటే తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వచ్చానని జగ్గారెడ్డి చెప్పారు. ఫోటో దిగుతామని రాహుల్ ను జగ్గారెడ్డి కోరారు దీంతో ఇవాళ రావాలని జగ్గారెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇచ్చారు.  దీంతో జగ్గారెడ్డి తన భార్య నిర్మల, కూతురితో కలిసి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహరశైలిని కూడా రాహుల్ తో భేటీ సమయంలో వివరించే అవకాశం లేకపోలేదని సమాచారం. అయితే రెండు రోజుల క్రితం రాహుల్ తో భేటీ ముగిసిన తర్వాత రాజీనామాను వెనక్కి తీసుకొన్నట్టుగా జగ్గారెడ్డి ప్రకటించారు. అంతేకాదు ఇప్పటివరకు తాను ఏం మాట్లాడానో మర్చిపోయాయని చెప్పారు.

మంగళవారం నాడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ సమయంలో కూడా పార్టీ వ్యవహరాలపై జగ్గారెడ్డి చర్చించారు.  జగ్గారెడ్డితో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా  భేటీ  అయ్యారు.


సీనియర్ నేతలతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై  పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాలను కూడా కొందరు నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఇప్పటివరకు పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టాలని రాహుల్ ఆదేశించారు. పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేతలంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. రాహుల్ ప్రతిపాదనకు పార్టీ నేతలు కూడా అంగీకరించారు.

రేవంత్ రెడ్డి తీరుపై నిరసనగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే పార్టీ సీనియర్ల సూచన మేరకు రాజీనామాపై కొన్ని రోజులు వేచి చూసే ధోరణిని అవలంభించారు. నిన్న రాహుల్ తో భేటీ తర్వాత రాజీనామా లేఖను వెనక్కి తీసుకొంటున్నట్టుగా ప్రకటించారు. రాహుల్ సమక్షంలోనే జగ్గారెడ్డి ఈ విషయాన్ని కేసీ వేణుగోపాల్ కు వివరించారు. ఈ విషయమై మంగళవారం నాడు వేణుగోపాల్ తో స్వయంగా భేటీ అయి ఈ విషయమై వివరణ ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?