నా భార్యతో కలిసి నిరాహారదీక్షకు దిగుతా: జగ్గారెడ్డి సంచలన ప్రకటన

By Arun Kumar PFirst Published Feb 15, 2019, 4:38 PM IST
Highlights

గతంలో తెలంగాణ రాష్ట్రానికి నీటిపారుదల మంత్రిగా పనిచేసిన హరీష్ రావు సొంత జిల్లా ఉమ్మడి మెదక్ కు తీరని అన్యాయం చేశారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సింగూరు, మంజీర జలాలను ఇక్కడి నుండి వేరు ప్రాంతాలకు తరలించుకుపోయి జిల్లా ప్రజలు ప్రస్తుతం దాహంతో అల్లాడిపోయేలా చేశారని అన్నారు. ఇలా ఇరిగేషన్ మంత్రిగా హరీష్ చేసిన జలదోపిడికి వ్యతిరేకంగా తన భార్య నిర్మలా రెడ్డితో కలిసి ఈ నెల 18వ తేదీ నుండి రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. 

కాంగ్రెస్ హయాంలో సంగారెడ్డి పట్టణానికి కేవలం 3కిలో మీటర్ల దూరంలో సింగూరు డ్యాంను నిర్మించారని జగ్గారెడ్డి తెలిపారు. 1962 లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నపుడు మంజీరా, 1976లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా వున్నపుడు సింగూరు డ్యాం నిర్మించారని వివరించారు.కేవలం తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఈ రిజర్వాయర్ల నీటిని హరీష్ తనకు ఇష్టం వచ్చినట్లు ఇతర ప్రాంతాలకు తరలించుకుపోయాడని జగ్గారెడ్డి ఆరోపించారు. మంత్రిగా వున్నపుడు ప్రతిదీ తన జాగీర్ అన్నట్లు హరీష్ వ్యవహరించాడని మండిపడ్డారు. 

ప్రస్తుతం  హరీష్ మంత్రిగా లేకపోయినప్పటికి గతంలో చేసిన తప్పులకు నైతిక బాధ్యత వహించి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఇచ్చిన హామీ ప్రకారం మంజీరా, సింగూరు డ్యాంలలో నీళ్లు నింపాలని కోరారు. అప్పటివరకు సంగారెడ్డి మండల  కార్యాలయం వద్ద తమ రిలే నిరాహార దీక్ష కినసాగుతుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ఇరిగేషన్ అధికారులతో, కలెక్టర్లతో హరీష్ చేసిన పొరపాటుపై చర్చించాలని జగ్గారెడ్డి కోరారు. హరీష్ తప్పులను సరిదిద్ది ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి మెదక్ ప్రజల దాహార్తిని తీర్చే చర్యలు  తీసుకోవాలని జగ్గారెడ్డి విన్నవించుకున్నారు. 
 
click me!