మరో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు...

Published : Sep 13, 2018, 05:09 PM ISTUpdated : Sep 19, 2018, 09:25 AM IST
మరో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు...

సారాంశం

తెలంగాణ లో ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉండనున్నాయని ప్రచారం జరుగుతున్న వేళ కాంగ్రెస్ నాయకులపై కేసులు పెరుగుతున్నాయి.. ఇప్పటికే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యేను జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా, రేవంత్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలంగౌడ్ పై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. తనను కులం పేరుతో శ్రీశైలం గౌడ్ దూషించాడంటూ నియోజకవర్గ పరిధిలోని జగద్గిరి గుట్ట దేవేందర్ నగర్ నివాసి రమేష్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో  శ్రీశైలంగౌడ్ పై రెండు రోజుల క్రితమే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాలనీలో అందరి ముందు శ్రీశైలం గౌడ్ తనను అవమానకరంగా దూషించాడని రమేష్ నాయక్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే ఈ ఘటనపై కూన శ్రీశైలం గౌడ్ ఇంకా స్పందించలేదు. త్వరలో అతన్ని పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలు త్వరలో ఉంటాయని ప్రచారం జరుగుతున్న వేళ వరుసగా ఇలా కాంగ్రెస్ నాయకులు కేసుల్లో చిక్కుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఇక కుండపోత వానలే... తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలమే
Rashmika Mandanna Speeh: లైఫ్ అంటే అదే.. స్టేజిపై స్పీచ్ ఇరగదీసిన రష్మిక | Asianet News Telugu