
ఎన్నికల సమయం కావడంతో టీఆర్ఎస్‌లోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు.
తాజాగా జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం లోకిరేవు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణయ్యగౌడ్, మాజీ ఎంపిటిసి కావలి సత్యం, మండల కాంగ్రెస్ నేత యాదవయ్య తమ అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్తలు 100 మందితో కలిసి టిఆర్ఎస్‌లో చేరారు.
అలాగే కొండాపూర్ గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ నేతలు రాఘవేందర్‌రెడ్డి, పురుషోత్తమరెడ్డిలు తమను చరులు 30 మందితో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. వీరందరికి మంత్రి లక్ష్మారెడ్డి పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.
"