Asianet News TeluguAsianet News Telugu

తారు డ్రమ్ములో ఇరుక్కుపోయిన కూలీ.. మూడు రోజులు నరకం.. లోపలికి ఎందుకు వెళ్లాడబ్బా.. ? (వీడియో)

బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వలస కూలి తారు ఉన్న డ్రమ్ములో ఇరుక్కుపోయాడు. (A labourer trapped in a tar drum) బయటకు రాలేక మూడు రోజుల పాటు నరకం అనుభవించాడు. చివరికి రెస్క్యూ టీమ్ సాయంతో పోలీసులు అతడిని బయటకు తీసుకొచ్చారు. (Man trapped in tar drum in Andhra Pradesh's NTR district) ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది.

The labourer trapped in the tar drum.. Three days of hell. The incident took place in NTR district of ANDHRA Pradesh. Video goes viral..ISR
Author
First Published Feb 7, 2024, 12:10 PM IST | Last Updated Feb 7, 2024, 12:10 PM IST

ఆయనో కూలి. బీహార్ నుంచి ఏపీకి వలస వచ్చాడు. ఎన్టీఆర్ జిల్లాలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అనుకోకుండా ఓ చిక్కుల్లో పడ్డాడు. తారు ఉన్న ఓ డ్రమ్ములో కూరుకుపోయాడు. మూడు రోజుల పాటు నరకం అనుభవించాడు. తరువాత ఏం జరిగిందంటే ? 

మంచి పనులు చేసే వ్యక్తికి గౌరవం దక్కదు - నితిన్ గడ్కరీ

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. బీహార్‌కు చెందిన ఓ కూలి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి జీవిస్తున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. రోడ్డు పక్కన స్థానికులు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ తారు డ్రమ్ము కనిపించింది.

అనుకోకుండా ఆ తారు డ్రమ్మును చూసిన స్థానికులు షాక్ అయ్యారు. అందులో వలస కూలి ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక మూడు రోజుల నుంచి అవస్థలు పడుతున్నాడని గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. అక్కడి చేరుకున్న పోలీసులు వెంటనే రెస్క్యూ టీమ్ ను పిలిపించారు.

బీజేపీ పడక గదుల్లోకి కూడా వచ్చేసింది - ఉత్తరాఖండ్ యూసీసీపై ప్రతిపక్షాల కామెంట్స్..

రెస్క్యూ టీమ్ తో కలిసి పోలీసులు ఆ డ్రమ్మును నిలువుగా కట్ చేశారు. కానీ డ్రమ్ము లోపల అతడి శరీరంలోని సగ భాగం ఇరుక్కుపోయింది. గంటల పాటు అతడిని బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్ ప్రయత్నించింది. చివరికి సురక్షితంగా బయటకు తీశారు. మూడు రోజుల పాటు నరకం అనుభవించిన ఆ కూలిని పోలీసులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అతడు డ్రమ్ము లోపలికి ఎందుకు వెళ్లాడు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios