మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. యూనివర్సిటీ నిర్వహణ ఆయనదే

Siva Kodati |  
Published : Nov 22, 2022, 07:46 PM IST
మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. యూనివర్సిటీ నిర్వహణ ఆయనదే

సారాంశం

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. 

మంత్రి మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. దూలపల్లి రోడ్‌లోని అశోక్ విల్లా నివాసంలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి అన్ని వ్యవహారాలు చూస్తున్నారు ప్రవీణ్ రెడ్డి. ఈ సందర్భంగా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

కాగా... మంగళవారం మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మల్లారెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అయితే క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జై కిషన్ ఇంట్లో సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. గతంలో చీకోటి ప్రవీణ్‌తో కలిసి ఆయన క్యాసినో వ్యవహారాల్లో కీ రోల్ పోషించినట్లుగా తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి కుటుంబ యాజమాన్యంలోని సీఎంఆర్ స్కూల్ పార్ట్‌నర్‌గా జైకిషన్ తండ్రి నర్సింహ యాదవ్ వున్నారు. 

Also REad:దర్యాప్తు సంస్థల దుర్వినియోగం: కేంద్రంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

మరోవైపు ఈ తనిఖీల్లో మంత్రి మల్లారెడ్డికి భారీగా ఆస్తులు వున్నట్లు అధికారులు గుర్తించారు. యూనివర్సిటీ, 38 ఇంజనీరింగ్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, పెట్రోల్ బంకులు, వందల ఎకరాల భూములు వున్నట్లు గుర్తించారు. మల్లారెడ్డి విద్యాసంస్థల నగదు లావాదేవీలు ఓ బ్యాంకులో జరిగినట్లు ఐటీ అధికారులు ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu