క్రాంతి బ్యాంక్‌కు మల్లారెడ్డి కోడలు, మనుమరాలు.. ఎంతకీ తెరచుకోని తాళం

By Siva KodatiFirst Published Nov 23, 2022, 6:23 PM IST
Highlights

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు , కార్యాలయాలు, బంధువుల నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు కలకలం రేపుతోన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం బాలానగర్ ప్రాంతంలోని క్రాంతి బ్యాంక్‌కు మల్లారెడ్డి కోడలు, మనుమరాలిని తీసుకెళ్లారు ఐటీ అధికారులు. 

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు , కార్యాలయాలు, బంధువుల నివాసాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం బాలానగర్ ప్రాంతంలోని క్రాంతి బ్యాంక్‌లో రెండో రోజూ ఐటీ తనిఖీలు జరిగాయి. మల్లారెడ్డి కోడలు, మనుమరాలిని బ్యాంక్‌కు తీసుకెళ్లారు ఐటీ అధికారులు. క్రాంతి బ్యాంక్‌లోని లాకర్లను తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే తాళాలు రాకపోవడంతో సిబ్బంది వెనుదిరిగారు. 

కాగా.. మల్లారెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ సోదాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. మల్లారెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంపల్లిలోని సంతోష్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నిన్నటి నుంచి జరుగుతున్న తనిఖీల్లో రూ.4 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

ALso REad:ప్రతిదాడులకు సిద్దం కావాలి: ఈడీ, ఐటీ సోదాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

మరోవైపు.. మహేందర్ రెడ్డి,  ప్రవీణ్ రెడ్డిల ఆరోగ్యం నిలకడగా  ఉందని  ఐటీ  అధికారులు ప్రకటించారు.  సోదాలకు  సహకరించాలని  ఐటీ  అధికారులు మంత్రి మల్లారెడ్డిని కోరారు. అనంతరం ఆసుపత్రి నుండి  మల్లారెడ్డిని  ఐటీ  అధికారులు  తీసుకెళ్లారు.  మంత్రి తనయుడు మహేందర్  రెడ్డి  అస్వస్థతకు  గురి కావడంతో  ఆయనను ఇవాళ  ఉదయం సూరారంలోని  నారాయణ  హృదయాలయంలో  చేర్పించారు. అటు మల్లారెడ్డి  బంధువు  ప్రవీణ్  రెడ్డికి బీపీ  డౌన్  కావడంతో ఆయనను  కూడా  నారాయణ  హృదయాలయానికి తరలించారు.  అయితే ప్రవీణ్ రెడ్డిపై సీఆర్‌పీఎఫ్  సిబ్బంది  దాడి చేశారని  మంత్రి  మల్లారెడ్డి  ఆరోపించారు. 
 

click me!