చుట్టుముట్టిన పాతిక మంది .. శ్రీనివాసరావు హత్యకు ముందు ఏం జరిగిందంటే..?

By Siva KodatiFirst Published Nov 23, 2022, 6:01 PM IST
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగిన సంగతి తెలిసిందే. హత్యకు ముందు శ్రీనివాసరావు చుట్టూ దాదాపు పాతిక మంది గుత్తికోయలు వున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో తేలింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్యకు ముందు ఏం జరిగింది..? అక్కడ పరిస్ధితి ఎలా వుంది..? ఈ వివరాలను శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించారు అటవీశాఖ అధికారులు. హత్యకు ముందు శ్రీనివాసరావు చుట్టూ దాదాపు పాతిక మంది గుత్తికోయలు వున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో తేలింది. వారి చేతుల్లో వేట కొడవళ్ల లాంటి పదునైన ఆయుధాలు కూడా వున్నాయి. ఈ విషయాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా సేకరించిన చిత్రాల్లో గుర్తించారు. శ్రీనివాసరావుపై దాడి చేసిన గుత్తికోయలు తీవ్రంగా గాయపరిచారు. ఇతర అటవీ శాఖ అధికారులు తేరుకుని ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లే లోగానే శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. 

మరోవైపు.. విధి నిర్వహణలో అమరుడైన చంద్రుగొండ రేంజ్ అటవీ అధికారి (ఎఫ్ఆర్వో) చలమల శ్రీనివాస రావు(45) అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోడు సాగుకు అడ్డు వస్తున్నాడని భద్రాద్రి  కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయిల చేతిలో శ్రీనివాసరావు దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపుడి లో శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు. 

ALso Read:ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాడె మోసిన మంత్రులు.. పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డి..

రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు అంత్యక్రియలకు హాజరై శ్రీనివాసరావుకు నివాళుర్పించారు. మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డిలు శ్రీనివాసరావు పాడె మోశారు. వీరితో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రేగా కాంతారావు, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతకుమారి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఏస్పీలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు 

click me!