అబ్బా.. రేవంత్ చెప్పింది 100 పర్సెంట్ నిజమా ?

First Published Nov 7, 2017, 4:12 PM IST
Highlights
  • రేవంత్ నిన్న చెప్పినవి నేడు జరుగుతున్నాయి
  • సీమాంధ్ర నేతలతో కేసిఆర్ స్నేహాన్ని బయటపెట్టిన రేవంత్

అవును. రేవంత్ రెడ్డి టిడిపిలో కొనసాగుతున్న కాలంలో ఆయన చెప్పింది వందకు వంద శాతం నిజమేనా? ఏదో ఉత్త ముచ్చటేమో అనుకున్నారు కొందరు జనాలు. కానీ అది ఉత్త ముచ్చట కాదని అక్షరాలా నిజమని ఇప్పుడు తేలిపోయిందంటున్నారు. ఇంతకూ రేవంత్ చెప్పిందేమిటి. అంత కరెక్టుగా నిజమైందేమిటి అని మీకు సందేహంగా ఉంటే ఈ వార్త చదవండి.

అవి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న రోజులు. అప్పుడే ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు దుమారం రేగుతున్నది. రేవంత్ ఢిల్లీ నుంచి వచ్చిండు. తన నివాసంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిండు. ఈ సందర్భంగా సీమాంధ్ర టిడిపి నేతలపై వరుసపెట్టి విరుచుకుపడ్డారు రేవంత్. అందులో ఎపి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలంగాణ సర్కారు వద్ద మంచి ప్రాజెక్టు కొట్టేశాడని ఆరోపించు. 2వేల కోట్ల ప్రాజెక్టును యనమలకు కేసిఆర్ అప్పగించిండన్నారు. కాబట్టి కేసిఆర్ మీద యనమల ఈగ కూడా వాలనివ్వడు అని ఆరోపించారు. తర్వాత తెలంగాణ టిడిపి నేతలు, ఎపి టిడిపి నేతలు దీన్ని ఉత్తముచ్చటగానే తీసి పారేశారు. అడపాదడపా ఖండించి మ్యాటర్ ను వదిలేశారు.

కానీ రెండు రోజులుగా ఈ విమర్శల్లో నిజం ఉన్నట్లుందే అని తెలంగాణ జనాల్లో చర్చ మాత్రం జరుగుతోంది. ఎందుకంటే యాదాద్రి పుణ్యక్షేత్రంలో పర్యటించారు యనమల. ఈ సందర్భంలో ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సర్కారు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నదని పొగడ్తలతో ముంచెత్తారు. ఒకవైపు ఇక్కడ తెలంగాణ టిడిపి నేతలు తెలంగాణ సర్కారు మీద ఇంకా పోరాటం చేస్తున్న కాలంలో యనమల ఆంధ్రా ఏరియా నుంచి వచ్చి ఇక్కడ కేసిఆర్ ను పొగిడిపోవడం ఎందుకబ్బా అన్న చర్చ ఊపందుకున్నది.

రేవంత్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరినప్పటికీ  ఇంకా తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణ సర్కారు వైఫల్యాల మీద గట్టిగానే పోరాటం చేస్తున్నది. ఎల్. రమణ బృందం తమ శక్తి మేరకు సర్కారు వైఫల్యాలపై కదులుతున్నది. కానీ ఇవేవీ పట్టకుండా ఎపి మంత్రి యనమల వచ్చి కేసిఆర్ సర్కార్ భేష్ అని పొగిడిపోవడం చూస్తే కచ్చితంగా ఏదో మతలబు ఉందన్న అనుమానాలు తెలంగాణ తెలుగుదేశం నేతల్లో కూడా వస్తున్నాయి. 2వేల కోట్ల కాంట్రాక్టు నిజమే కావొచ్చా అన్న చర్చ కూడా టిడిపి వర్గాల్లో జోరందుకున్నది. రేవంత్ విమర్శలకు తగ్గట్టుగానే యనమల వ్యవహారం నడిపిండని కొందరు నేతుల చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో రేవంత్ చెప్పినట్లే రానున్న ఎన్నికల్లో టిడిపి, టిఆర్ఎస్ పొత్తు ఖాయమన్న వాతావరణం నెలకొందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దీనికితోడు మొన్న జరిగిన తెలంగాణ కీలక సమావేశంలో సైతం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ సర్కారు మీద పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చు టిఆర్ఎస్ తో కలిసిపోయే రీతిలోనే మాట్లాడారు. ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన విషయాన్ని ఆయన చెప్పలేదు. దీంతో ఈ పరిణామాలన్నీ చూస్తే రేవంత్ రెడ్డి అనుమానాలు, ఆరోపణలు వందకు వంద శాతం నిజమే అయ్యాయయని తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి.  

చిరంజీవి ఇంట్లో దొంగ దొరికిన వార్తతో పాటు

మరిన్ని తాజా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

https://goo.gl/4h1Qxh

 

click me!